ఇన్ఫోసిస్‌లో ఇద్దరు కొత్త అధ్యక్షులు

Posted By:

ఇన్ఫోసిస్‌లో ఇద్దరు కొత్త అధ్యక్షులు

దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తన మేనేజ్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరిచింది. తమ యాజమాన్య పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రెండు గ్లోబల్ విభాగాలకు బి.జి శ్రీనివాస్, యు.బి ప్రవీణ్ రావులను అధిపతులుగా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. వీరు నేరుగా సంస్థ సీఈఓ ఎస్.డి. శిబులాల్‌కు రిపోర్ట్ చేస్తారని ఇన్ఫోసిస్ తెలిపింది.

ఆర్థిక సేవలు, బీమా, తయారీ, ఇంజినీరింగ్ సేవలు, ఇంధన, సమాచార వ్యవస్థలు, ఇన్షోసిస్ పబ్లిక్, సర్వీసెస్, ఇన్ఫోసిస్ లోడ్‌స్టోన్, వ్యూహాత్మక గ్లోబల్ సోర్సింగ్, మార్కెటింగ్ ఇంకా అనుబంధ సేవల విభాగాలకు శ్రీనివాస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక రిటైల్, వినియోగదారు ప్యాకేజీ వస్తువులు, రవాణా, లైఫ్ సైన్సెస్, వనురులు, యుటిలిటీలు, సేవలు, క్లౌడ్, మొబిలిటీ, నాణ్యత ఉత్పాదకత, ఇన్షోసిస్ లీడర్ షిప్ ఇన్ స్టిట్యూల్ తదితర విభాగాలకు యు.బి. ప్రవీణ్ రావు పర్యవేక్షిస్తాని ఇన్ఫోసిస్ వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot