క్యాంపస్ విషయంలో ఐన్ఫోసీస్ కు తొలిగిన అడ్డంకులు..

Posted By: Super

క్యాంపస్ విషయంలో ఐన్ఫోసీస్ కు తొలిగిన అడ్డంకులు..

హైదరాబాద్ : ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐన్ఫోసిస్ కు పోచారం క్యాంపస్ ప్రాజెక్టు విషయంలో నెలకున్న సమస్యకు చిక్కుముడి వీడింది. ప్రాజెక్టు పై సందగ్థిత నెలకొన్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి మంగళవారం ఐన్ఫోసిస్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రాజెక్టును రద్దు చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ర్టీయల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఇచ్చిన నోటీసులను ప్రభుత్వం తిరస్కరిచ్చింది.

కర్ణాటకలో ఐటీ సంస్థలకు భూములు మంజూరు చేయటం పై సీనియర్ రాజకీయ వేత్త హెచ్ డీ దేవ్ గౌడా అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఇన్ఫోసిస్ ప్రాజెక్టు నిర్మాణ స్ధలం కోసం పక్క రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో వై.ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు 450 ఏకరాల స్థలాన్ని పోచారంలో ఇన్ఫోసిస్ కు కేటాయించింది.

ఐటీ సంస్థ ఐన్ఫోసిస్ తన రెండో ప్రాజెక్టు నిర్మించుకునేందుకు ఏపీఐఐసీ గతంలో భూములు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్థేశిత సమయంలో ఇన్ఫోసిస్ అనుకున్న ప్రాజెక్టును పూర్తి చేయకపోవటంతో ఏపీఐఐసీ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపధ్యంలో గ్రూపు మేనేజింగ్ డైరక్టర్ ఎస్.గోపాల కృష్ణ నేతృత్వంలోని సంస్థ బృందం మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. ఏపీఐఐసీ నోటీసులకు సంబంధించి ప్రాజెక్టు ఆలస్యానికి గల కారణాలను ముఖ్య మంత్రికి సంస్థ సభ్యులు వివరించారు.తమకు సెజ్ గుర్తింపు 2007లో లభించిందని, 2008 నాటికి తొలి దశ పూర్తి అయ్యిందని, ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతి మే 2009లో లభించిందని, ఈ కారణాల వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావల్సి వచ్చిందని వారు వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ఫోసిస్ కు ప్రస్తుతం అవాంతారలు ఏమి లేవిని వారు నిర్భయంగా వారి ప్రాజెక్టును విస్తరించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot