ఉద్యోగులకు ఇన్ఫోసిస్ జీతాల పెంపు!
ప్రముఖ బహుళజాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది. ఉద్యోగుల స్థాయిని బట్టి 4 నుంచి 10 శాతం వరకు వేతన ఇంక్రిమెంట్‌లను ఇన్ఫోసిస్ ఇవ్వనుంది. ఈ వేతన పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. జూనియర్ ఉద్యోగులు, నాన్ - ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు లెవల్ 2 పరిధిలోకి వస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్లు, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్లు లెవల్ 6 పరిధిలోకి వస్తారు.

ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతలు గడించిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ‘ఇన్ఫోసిస్' ప్రతిభ కనబర్చని ఉద్యోగుల పై వేటు విధించేందుక రంగం సిద్థం చేస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఈ దిగ్గజ ఐటీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అత్యధిక జీతాలు తీసుకుంటూ అందుకు అనుగుణంగా పనితీరును కనబర్చని ఉద్యోగులకు పిక్ స్లిప్‌లు జారీ చేయబడతాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








