ఇన్పోసిస్ కోల్‌కత్తా సెంటర్ ఆరు మాసాల్లో...

Posted By: Prashanth

ఇన్పోసిస్ కోల్‌కత్తా సెంటర్ ఆరు మాసాల్లో...

 

కోల్‌కత్తా: దేశంలో రెండవ అతి పెద్ద ఐటి లీడర్ ఇన్పోసిస్ గతంలో కోల్ కత్తాలో సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ స్దాపించనున్న స్దలానికి గాను రూ 75 కోట్లను ఇప్పటికే చెల్లించడం జరిగింది. రానున్న మూడు లేదా ఆరు నెల్లలో డెవలప్ మెంట్ సెంటర్‌కి సంబంధించిన పూర్తి వర్క్ మొత్తం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.

కోల్ కత్తాలో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ కో - చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ ప్రస్తుతం మేము ప్రోగ్రస్‌లో ఉన్నాం. కోల్ కత్తాలో సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్‌ భూమికి సంబంధించిన పూర్తి డబ్బుని చెల్లించడం జరిగిందన్నారు. ఒక్కో ఎకరానికి గాను మేము రూ 1.5 కోట్లను చెల్లించామని తెలిపారు. మొట్ట మొదట దశలో రూ 100 కోట్ల పెట్టుబడి పెట్టి, 5,000 మంది ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot