విప్లవాత్మక ఆవిష్కరణలు!!

|

క్నాలజీ విభాగంలో నిత్యం ఏదో ఒక ఆవిష్కరణ చోటుచేసుకుంటోంది. వాక్ మెన్.. మొబైల్ ఫోన్... కంప్యూటర్ ఇలా అనేక ఆవిష్కరణలు ప్రపంచ స్థతిగతులను మార్చేసాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా సాంకేతిక ప్రపంచంలో చిరస్మరణీయమైన హోదాను దక్కించుకుని విజయవంతంగా కొనసాగుతున్న పలు అత్యుత్తమ ఆవిష్కరణల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 విప్లవాత్మక ఆవిష్కరణలు!!

సోనీ వాక్‌మెన్:

మ్యూజిక్ ప్రపంచానికి సోనీ వాక్‌మెన్ సుపరిచితం. 1979-80 ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన ఈ మ్యూజిక్ ప్లేయర్ ద్వారా సంగీతాన్ని బాహ్య ప్రపంచంలో సైతం ఆస్వాదించగలుగుతున్నాం. సోనీ వాక్‌మెన్ ఇప్పుడు అనేక వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

యాపిల్ ఐఫోన్:

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5 ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో ఆవిష్కరించటం జరిగింది.

గూగుల్ గ్లాస్:

గూగుల్ సంస్థ వినూత్న ఆవిష్కరణ ‘గూగుల్ గ్లాస్'. ఈ టెక్నాలజీ ప్రపంచానికే సరికొత్త ఒరవడి. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్.. మెసేజింగ్.. వెబ్ బ్రౌజింగ్ ఇలా అనేక ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ కళ్లద్దాలతో ఫోటోలను సైతం చిత్రీకరించుకోవచ్చు. వీడియోలను సైతం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రియాలిటీ గ్లాసెస్ ఆధారంగా ఆచూకీలను సైతం కనుగొనవచ్చు. వీటి తయారీకి గూగుల్ రెండేళ్ల పాటు శ్రమించింది.

గూగుల్ డ్రైవర్ రహిత కారు:

డ్రైవర్ రహిత కార్ల తయారీ పై గూగుల్ దృష్టిసారించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనలు గూగుల్ ఎక్స్ ప్రయోగశాలలో జరుగుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లయితే సురక్షిత డ్రైవింగ్‌తో కూడిన కారు ప్రయాణాలను సాగించవచ్చు.

ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్:

ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్ మార్గదర్శిలుగా నిలవనున్న నేపధ్యంలో యాపిల్, సామ్‌సంగ్, ఎల్‌జి వంటి ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లు ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X