ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువగా వినియోగిస్తుంటారా.. అయితే ఈ ఫీచర్ గురించి తెలుసుకోండి..!!
మెటా నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లు యాడ్స్ విషయంలో ఇటీవల కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యాడ్ బ్లాకర్ లను వినియోగిస్తున్న వారికి చెక్ పెట్టేలా యూట్యూబ్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా ఇన్‌స్టాగ్రామ్ కూడా కొత్త ఫీచర్ ను టెస్టింగ్ చేస్తోంది. ప్రకటనదారులకు ఇన్‌స్టాగ్రామ్ మరింత లాభదాయకంగా మార్చేందుకు యాడ్ బ్రేక్స్ (Instagram Ad Breaks) పేరుతో ఫీచర్ ను తీసుకొస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
యాడ్ బ్రేక్స్ ఫీచర్ ద్వారా వీడియోను Skip చేసేందుకు అవకాశం లేని యాడ్‌లను వినియోగదారులకు చూపుతుంది. ఫలితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరిన్ని ఫోస్టులు చూడాలంటే కచ్చితంగా యాడ్స్‌ను పూర్తిగా చూడాల్సి ఉంటుంది. కొన్ని పోస్టుల తర్వాత యాడ్ బ్రేక్ కనిపిస్తుంది. అనంతరం వచ్చిన యాడ్‌ను పూర్తిగా చూశాకనే.. మరిన్ని ఫోస్టులు చూసేందుకు అవకాశం ఉంటుంది.

అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోని యూడ్ బ్రేక్ ఫీచర్.. రీల్స్ లేదా స్టోరీల కోసమా అనే విషయంలో సంస్థ స్పష్టత ఇవ్వలేదు. మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఈ యూడ్స్ నిబంధనలు వర్తిస్తాయా లేదా కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తాయా అనేది వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ అధికార ప్రతినిధి మ్యాథ్యూ టై ధ్రువీకరించారు.
ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే అప్‌డేట్‌లపై అన్ని వివరాలు అందిస్తామన్నారు. అయితే ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ యాడ్‌లను పోస్టు చేస్తోంది. అయితే ఇవి skip చేసేందుకు అవకాశం ఉన్నవి. త్వరలోనే యాడ్ విషయంలో మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో వెల్లడి కాలేదు.
** యూట్యూ్బ్ కూడా యాడ్ బ్లాకర్‌లు వినియోగిస్తున్న యూజర్లకు షాక్ ఇచ్చే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నుంచే యూట్యూబ్ ఈ యాడ్ బ్లాకర్ల్‌ను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. యాడ్ బ్లాకర్‌లను నిలిపేయాలని కోరుతూ తొలుత నోటిఫికేషన్‌లను పంపిన యూట్యూబ్.. తాజాగా వారు వీడియోలను చూసేందుకు అవకాశం లేకుండా నియంత్రణ విధించనుంది.
యూట్యూబ్‌లో యాడ్ బ్లాకర్‌ల సాయంతో వీడియోలను ప్లే చేస్తుంటే.. వీడియోలు ఆటోమేటిక్‌గా చివరి వరకు వచ్చేస్తాయి. అంటే వీడియో ఓపెన్ చేయగానే.. చివరి వరకు ప్లే అయినట్లు చూపిస్తుంది. దీని ద్వారా యాడ్ బ్లాకర్‌లు వినియోగించే యూజర్లు అసలు వీడియోలు చూసే అవకాశం కోల్పోనున్నారు.
ఇప్పటికే ఈ తరహా పరిస్థితి తమకు ఎదురవుతుందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. యాడ్స్ లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూడాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని యూట్యూబ్ సూచించింది. యూట్యూబ్‌లోని కంటెంట్ క్రియేటర్ల ఆదాయం కోసం యాడ్స్ అవసరమని సంస్థ చెబుతోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








