Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 19 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
కోమటిరెడ్డికి ఊహించని షాక్.. కోవర్ట్ వెంకట్‌రెడ్డి పోస్టర్లు.. నల్గొండ కాంగ్రెస్‌లో రచ్చ!!
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సరికొత్త మార్పులు!! ఏమిటో ఓ లుక్ వేయండి....
ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీని వినియోగించే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలను వినియోగిస్తున్నారు. అధికంగా వినియోగించే సోషల్ మీడియా యాప్ లలో ఒకటి ఇన్‌స్టాగ్రామ్. ఈ ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక కొత్త మార్పును పరీక్షిస్తోంది. దీని విషయానికి వస్తే ఈ ఫోటో మరియు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయబడిన ప్రతి వీడియోను రీల్‌గా మారుస్తుంది. ఈ మార్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులతో పరీక్షించబడుతోంది. ప్లాట్‌ఫారమ్‌లోని మొత్తం వీడియో అనుభవాన్ని సులభతరం చేయడానికి కంపెనీ యొక్క విస్తృత ప్రణాళికలలో ఇది ఒక భాగం.

"ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా యొక్క ప్లాట్‌ఫారమ్‌లో వీడియో అనుభవాన్ని సులభతరం చేయడానికి మరియు మరింత మెరుగుపరచే మా యొక్క ప్రయత్నాలలో భాగంగా మేము ఈ సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాము" అని మెటా ప్రతినిధి కంపెనీ యొక్క ఈ మార్పును గురించి మీడియా సమావేశంలో తెలిపారు.
Instagram is now making EVERY video a Reel
— Matt Navarra (@MattNavarra) June 30, 2022
h/t @ChristinaSBG pic.twitter.com/YLRDhT1nw0
మెటా కంపెనీ యొక్క ప్రతినిధి మాట్ నవర్రా ట్విట్టర్ ద్వారా ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. దీని ప్రకారం పబ్లిక్ ప్రొఫైల్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వారి యొక్క వీడియో పోస్ట్‌లు రీల్స్‌గా షేర్ చేయబడుతున్నాయి అని మెసెజ్ చూపబడుతోంది. మీ అకౌంట్ పబ్లిక్‌గా ఉంటే కనుక ఎవరైనా మీ వీడియోను కనుగొనవచ్చు మరియు రీల్‌ను రూపొందించడానికి మీ ఒరిజినల్ ఆడియోను ఉపయోగించవచ్చు అని కూడా ఈ మెసేజ్ చూపుతోంది. ఇది కాకుండా మీరు ఒకసారి రీల్‌ను షేర్ చేస్తే కనుక ఎవరైనా మీ రీల్‌తో రీమిక్స్‌ని సృష్టించవచ్చు మరియు వారి రీమిక్స్‌లో భాగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని కూడా చూపుతున్నది. అయితే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్‌ల నుండి లేదా ప్రతి రీల్‌లో ఆఫ్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్రైవేట్ అకౌంట్ల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ తమ యొక్క అనుచరులతో మాత్రమే భాగస్వామ్యం చేయబడుతుంది. ఈ కొత్త మార్పు దాని ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం అనుభవాన్ని సరళీకృతం చేయడం మరియు దాని కోసం పని చేసే కార్యాచరణపై దృష్టిని తిరిగి తీసుకురావడం వంటి ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్లాన్లలో భాగంగా ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారులు గడిపే సమయంలో అధిక శాతం రీల్స్ ని చూడడానికి ఇష్టపడే వారు ఉన్నారు. రీల్స్ చూసే వారు 20 శాతానికి పైగా ఉన్నారని ఈ సంవత్సరం ప్రారంభంలో మెటా తెలిపింది. ఈ చర్యతో ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ టిక్‌టాక్‌తో మెరుగైన పోటీని అందించే అవకాశం ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్లాట్‌ఫారమ్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు ప్రేక్షకులకు అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుందో అన్న దానికి ఎటువంటి సమాచారం లేదు. ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ తన వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందించాలని నిర్ణయించుకుంటే కనుక అది ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఇతర ఫీచర్‌లపై దెబ్బపడే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షితిజసమాంతర వీడియోలు మరియు 60 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను భాగస్వామ్యం చేయగల సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి గత సంవత్సరం ఒక పోస్ట్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఇకపై 'కేవలం ఫోటో షేరింగ్ యాప్' మాత్రమే కాదని ప్రకటనను చేసారు. అదే పోస్ట్‌లో కంపెనీ 2022లో వీడియోలపై అధికంగా దృష్టి సారిస్తుందని అతను చెప్పాడు. కాబట్టి రీల్స్‌కు మారడం అనేది కంపెనీ యొక్క ప్లాన్ లో ఒక భాగమే.

ఇన్‌స్టాగ్రామ్‌లో అజ్ఞాత మెసేజ్ లను పంపే విధానం
ఇన్‌స్టాగ్రామ్‌లోని వినియోగదారులు అజ్ఞాత (అనామక) టెక్స్ట్‌లను పంపడానికి NGL యాప్‌ను ఉపయోగించవలసి ఉంటుంది.
** ముందుగా ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్) లేదా యాప్ స్టోర్ (iOS)ని సందర్శించి NGL యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
** తరువాత NGL యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి యాప్‌ను ఓపెన్ చేయండి.
** "గెట్ క్యూషన్స్" బటన్‌పై నొక్కండి. ఆపై మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను నమోదు చేయండి.
** "డన్" ఎంపికపై నొక్కండి. ఈ యాప్ మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కలిగి ఉండే అజ్ఞాత మెసేజ్ యొక్క లింక్‌ను రూపొందిస్తుంది.
** ప్లే స్క్రీన్‌లో కాపీ లింక్‌ని ఎంచుకోండి. తరువాత "షేర్" బటన్‌ను ఎంచుకోండి.
** ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి NGL లింక్ స్టిక్కర్‌ని పేస్ట్ చేసి షేర్ చేయండి.
ఇన్‌స్టాగ్రామ్‌లోని మీ యొక్క ఫాలోవెర్స్ ఈ అజ్ఞాత మెసేజ్ లను చూడడానికి ఈ లింక్‌ను అనుసరిస్తారు. వారి యొక్క ప్రతిస్పందనలను NGL యాప్‌లోని ఇన్‌బాక్స్ విభాగంలో చూడవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ 90-సెకన్ల రీల్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చే కొత్త ఫీచర్ లలో 90-సెకన్ల రీల్స్ అనేది భారీ మార్పు. ఇప్పటి వరకు రీల్స్ 60 సెకన్లు మాత్రమే ఉండేవి మరియు ఇప్పుడు 90 సెకన్లకు పెంచబడింది.ఈ పరిమితి లోతైన కథనాలను చెప్పడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది. "మీ గురించి మరింత పంచుకోవడానికి, తెరవెనుక అదనపు క్లిప్‌లను చిత్రీకరించడానికి, మీ కంటెంట్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను లోతుగా తీయడానికి లేదా ఆ అదనపు సమయంతో మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా" అని కంపెనీ పోస్ట్ లో పేర్కొంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470