Instagram అల్ట్రా-టాల్ 9:16 ఫోటో కొత్త ఫీచర్ మీద పనిచేస్తోంది...

|

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఫోటో మరియు వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్ కంటెంట్‌ను తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఇది ఫోటోల షేరింగ్ కోసం కొత్త ఫార్మాట్‌లో పని చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ CEO ఆడమ్ మోస్సేరి తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రెండు వారాల్లో ఈ ప్రముఖ ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అల్ట్రా-టాల్ 9:16 ఫోటోలను పరీక్షించడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఏవైనా ఫోటోలను ప్రదర్శించేటప్పుడు కేవలం 4:5 నిష్పత్తిని మాత్రమే అందిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్

ఫోటో మరియు వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్లాట్‌ఫారమ్‌లో మీరు అధిక లెంగ్థ్ ఉండే లేదా పొడవైన వీడియోలను కలిగి ఉండవచ్చు కానీ మీరు అధిక పరిమాణంలో లేదా పొడవైన ఫోటోలను కలిగి ఉండలేరు. కాబట్టి మనం రెండిటిని సమానంగా చూసేలా చూసుకోవాలి అని అనుకున్నాం. కావున కొత్త ఫార్మాట్‌తో ఫోటోలు కూడా రీల్స్ మాదిరిగానే స్క్రీన్‌ మొత్తం పరిమాణాన్ని కలిగి ఉంటాయి అని వీక్లీ ఆస్క్ మి ఎనీథింగ్ ఎపిసోడ్‌లో మోస్సేరి వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ అల్ట్రా-టాల్ ఫోటోలను పరీక్షించడం ప్రారంభించింది

ఇన్‌స్టాగ్రామ్ అల్ట్రా-టాల్ ఫోటోలను పరీక్షించడం ప్రారంభించింది

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో ఇంతకుముందు ఫోటోల యొక్క 9:16 నిష్పత్తి విధానం ఫోటోగ్రాఫర్‌లచే అధికంగా విమర్శించబడింది. ఇది ఫోటో యొక్క నాణ్యతను దిగజార్చడమే కాకుండా ఇబ్బందికరంగా కూడా కనిపిస్తుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ది వెర్జ్ యొక్క నివేదిక ప్రకారం "కొత్త ఫీడ్ పోస్ట్‌ల దిగువన ఓవర్‌లే గ్రేడియంట్‌లను కూడా జోడించింది. తద్వారా టెక్స్ట్ చదవడం సులభం అవుతుంది. కానీ అది ఫోటోగ్రాఫర్‌ల పని యొక్క అసలు రూపంతో ఘర్షణ పడింది.

అల్ట్రా-టాల్ ఫోటో ఫార్మాట్‌

అల్ట్రా-టాల్ 9:16 ఫోటోల కోసం ఈ ఫార్మాట్ అనువైనది కాదని మోస్సేరి అంగీకరించింది. అయితే కంపెనీ ఇప్పటికీ అల్ట్రా-టాల్ ఫోటో ఫార్మాట్‌ను రూపొందించాలని భావిస్తోంది. అయితే ఈ విధానం అన్ని చిత్రాలకు తప్పనిసరి కాదు అని అభిప్రాయపడ్డారు. ఈ ఫార్మాట్‌పై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ప్రజలు యాప్‌లో సమయాన్ని తగ్గించుకున్నట్లు తెలిసింది. దీనికి మోస్సేరి స్పందిస్తూ "మనం ఒక అడుగు వెనక్కి వేయాలని, తిరిగి సమూహపరచాలని మరియు మనం ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నామో గుర్తించాలని నేను భావిస్తున్నాను అని తెలిపారు."

ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల తన UI మార్పులను వెనక్కి తీసుకుంది. ఇందులో ఫీడ్‌లలో ఫుల్-స్క్రీన్ వీడియో పోస్ట్‌లు ఉన్నాయి (టిక్‌టాక్‌కి చాలా పోలి ఉంటుంది). ప్లాట్‌ఫారమ్ అల్గారిథమ్‌ల ఆధారంగా సిఫార్సు చేసిన పోస్ట్‌లను కూడా తగ్గించింది. ఇన్‌స్టాగ్రామ్ ఈ మార్పులకు భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఇది జరిగింది. కైలీ జెన్నర్ మరియు కిమ్ కర్దాషియాన్ వంటి ప్రముఖులు మరియు ప్రభావశీలులు ఇమేజ్ షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ చేసిన ఈ మార్పుల గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్‌

మెటా కంపెనీ యొక్క ప్రతినిధి మాట్ నవర్రా ట్విట్టర్ ద్వారా ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. దీని ప్రకారం పబ్లిక్ ప్రొఫైల్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వారి యొక్క వీడియో పోస్ట్‌లు రీల్స్‌గా షేర్ చేయబడుతున్నాయి అని మెసెజ్ చూపబడుతోంది. మీ అకౌంట్ పబ్లిక్‌గా ఉంటే కనుక ఎవరైనా మీ వీడియోను కనుగొనవచ్చు మరియు రీల్‌ను రూపొందించడానికి మీ ఒరిజినల్ ఆడియోను ఉపయోగించవచ్చు అని కూడా ఈ మెసేజ్ చూపుతోంది. ఇది కాకుండా మీరు ఒకసారి రీల్‌ను షేర్ చేస్తే కనుక ఎవరైనా మీ రీల్‌తో రీమిక్స్‌ని సృష్టించవచ్చు మరియు వారి రీమిక్స్‌లో భాగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని కూడా చూపుతున్నది. అయితే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్‌ల నుండి లేదా ప్రతి రీల్‌లో ఆఫ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్రైవేట్ అకౌంట్ల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ తమ యొక్క అనుచరులతో మాత్రమే భాగస్వామ్యం చేయబడుతుంది. ఈ కొత్త మార్పు దాని ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం అనుభవాన్ని సరళీకృతం చేయడం మరియు దాని కోసం పని చేసే కార్యాచరణపై దృష్టిని తిరిగి తీసుకురావడం వంటి ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్లాన్లలో భాగంగా ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారులు గడిపే సమయంలో అధిక శాతం రీల్స్ ని చూడడానికి ఇష్టపడే వారు ఉన్నారు. రీల్స్ చూసే వారు 20 శాతానికి పైగా ఉన్నారని ఈ సంవత్సరం ప్రారంభంలో మెటా తెలిపింది. ఈ చర్యతో ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ టిక్‌టాక్‌తో మెరుగైన పోటీని అందించే అవకాశం ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌

ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్లాట్‌ఫారమ్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు ప్రేక్షకులకు అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుందో అన్న దానికి ఎటువంటి సమాచారం లేదు. ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ తన వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందించాలని నిర్ణయించుకుంటే కనుక అది ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఇతర ఫీచర్‌లపై దెబ్బపడే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షితిజసమాంతర వీడియోలు మరియు 60 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను భాగస్వామ్యం చేయగల సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి గత సంవత్సరం ఒక పోస్ట్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఇకపై 'కేవలం ఫోటో షేరింగ్ యాప్' మాత్రమే కాదని ప్రకటనను చేసారు. అదే పోస్ట్‌లో కంపెనీ 2022లో వీడియోలపై అధికంగా దృష్టి సారిస్తుందని అతను చెప్పాడు. కాబట్టి రీల్స్‌కు మారడం అనేది కంపెనీ యొక్క ప్లాన్ లో ఒక భాగమే.

Best Mobiles in India

English summary
Instagram App Starting Testing Ultra-Tall Full-Screen Photos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X