Instagramలో కొత్త ఫీచ‌ర్‌.. పిల్ల‌లు ఇక అలాంటి కంటెంట్‌ను చూడ‌లేరు!

|

Metaకు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం Instagram, త‌మ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ప‌లు మార్పుల‌ను తీసుకు వ‌స్తోంది. తాజాగా Instagram తన ప్రైవసీ ఫీచర్లలో మ‌రిన్ని కొత్త మార్పులు చేసింది. ఈ మార్పుల‌ ప్రకారం, ఇప్పుడు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సున్నితమైన కంటెంట్‌ను చూసేందుకు అవ‌కాశం ఉండ‌దు.

Instagram

యుక్తవయస్సు వినియోగదారుల కోసం డిఫాల్ట్‌గా సున్నితమైన కంటెంట్‌ను పరిమితం చేసేలా ఈ మార్పులు రానున్నాయి. సున్నితమైన కంటెంట్ నుండి పిల్లలను రక్షించడానికి మేము గోప్యతా ఫీచర్‌లకు కొన్ని మార్పులు చేస్తున్నామని META యాజమాన్యంలోని Instagram అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, త్వరలో ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వ‌స్తుంది. ఈ తాజా ఫీచ‌ర్ల‌తో, Instagram మునుపటి కంటే మరింత సురక్షితంగా మరియు వినోదాత్మ‌కంగా మారుతుంది. ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఈ కొత్త ఫీచర్ ద్వారా, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్‌లో రెండు ఆప్ష‌న్లు మాత్రమే ఇవ్వబడతాయి. పిల్లలు ప్రామాణిక మరియు లేస్ అనే ఆప్ష‌న్ల‌ను మాత్రమే ఎంచుకోవచ్చు. తద్వారా 16 ఏళ్ల లోపు వారిని సెన్సిటివ్ కంటెంట్ నుంచి దూరం చేయ‌వ‌చ్చు.

Instagram

ఇప్పుడు ఈ గోప్యతా ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, పిల్లలు సెన్సిటివ్ కంటెంట్ సంబంధించి ఏవైనా హ్యాష్‌ట్యాగ్‌లు, పేజీలు, రీల్స్, న్యూస్ ఫీడ్‌లను సెర్చ్ చేసినా కనుగొనలేరు. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ ఫీచర్‌లో అనేక భద్రతా ఫీచర్లు కూడా ఇవ్వబడ్డాయి. కొత్త ఫీచర్‌ల ప్రకారం, పిల్లలు కంటెంట్‌ను షేర్ చేసే సమయాన్ని మరియు Instagramని ఉపయోగించే సమయాన్ని కూడా మేనేజ్ చేయ‌గ‌ల అవ‌కాశం అందుబాటులోకి రానుంది.

Instagram

అదేవిధంగా, Instagram కంపెనీ త‌మ యూజ‌ర్లు ఇన్‌స్టా Reels పై అధికంగా వ్యూస్ సంపాదించుకునేందుకు వీలుగా రీల్స్‌ను ఫేస్‌బుక్‌లో క్రాస్-పోస్టింగ్ చేసే ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచ‌ర్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం:

Instagram నుండి Facebookకి ఏదైనా రీల్ వీడియోను క్రాస్-పోస్ట్ చేయడానికి అనుమతించే ఫీచర్ అందుబాటులో తెస్తున్నామ‌ని ఇన్‌స్టా చీఫ్ ఆడ‌మ్ మోసెరీ ఇటీవ‌ల‌ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించుకోవడానికి వినియోగదారులు రెండు ప్లాట్‌ఫారమ్‌లలో రిజిస్టర్డ్ ఖాతాను కలిగి ఉండాలి. ఇటీవ‌ల మోస్సేరి ఓ ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడుతూ, ." ప్ర‌జ‌లకు వినోదాత్మక కంటెంట్‌ను అందించ‌డానికి మేము కొన్ని కొత్త రీల్స్ ఫీచర్‌లను ప్రారంభిస్తున్నాము.." అని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా అతను IG-టు-FB క్రాస్‌పోస్టింగ్ వంటి ఫీచర్‌లను వెల్లడి చేశాడు. Instagram మరియు Facebookలో ఏకకాలంలో మీ కంటెంట్‌ను విస్తరించాలనుకుంటే ఈ కొత్త ఫీచర్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Instagram రీల్‌ను Facebookలో ఎలా క్రాస్-పోస్ట్ ఎలాచేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా మీ మొబైల్ లేదా ట్యాబ్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
* రీల్‌ను రికార్డ్ చేయ‌డం ప్రారంభించాలి.
* రీల్ రికార్డింగ్ పూర్త‌యిన త‌ర్వాత నెక్స్ట్ బ‌ట‌న్ నొక్కాలి.
* ఇప్పుడు మీకు "షేర్ ఆన్ ఫేస్‌బుక్‌" అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీరు ఏదైతే ఫేస్‌బుక్ అకౌంట్‌లో రీల్ ను షేర్ చేయాల‌నుకుంటున్నారో ఆ ఫేస్‌బుక్ ఐడీని ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత షేర్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ రీల్ ఫేస్‌బుక్‌లో షేర్ విజ‌య‌వంతం అవుతుంది.

Instagram

మీరు మీ భవిష్యత్ Instagram రీల్స్‌ను Facebookకి ఆటోమెటిక్‌గా క్రాస్-పోస్ట్ చేసే ఎంపికను కూడా సెట్ చేయవచ్చు. అయితే, మీరు ఈ ఫీచర్‌ని మాన్యువల్‌గా సెట్ చేయాలి. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఇస్తున్నాం. ఫాలో అయిపోండి.
* ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* త‌ర్వాత మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత (3 లైన్ ఐకాన్‌)పై క్లిక్ చేసి మోర్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* అనంత‌రం సెట్టింగ్స్ ఆప్ష‌న్ క్లిక్ చేసి ఆ త‌ర్వాత అకౌంట్ సెంట‌ర్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* మీరు క్రాస్-పోస్ట్ చేయాలనుకుంటున్న ఖాతాను మరియు అది పోస్ట్ చేయబడే ఖాతాను జోడించడానికి ఆన్-స్క్రీన్ చూపించే స్టెప్స్‌ను అనుసరించండి.
* ఆ త‌ర్వాత పోస్ట్‌ను ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
* ఈ ప్ర‌క్రియ విజ‌యవంతంగా పూర్తి చేస్తే మీ ఇన్‌స్టా రీల్స్ ఫేస్‌బుక్‌లో ఆటోమెటిక్ క్రాస్‌పోస్టింగ్ ఫీచ‌ర్ యాక్టివేట్ అయిన‌ట్లే అని నిర్దారించుకోవాలి.

Best Mobiles in India

English summary
Instagram brought such a feature, children will not be able to see sensitive or adult content

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X