ఫేస్‌బుక్‌ కి గుడ్ బై చెప్పిన ఇన్‌స్టాగ్రామ్ యాప్ వ్యవస్థాపకులు

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులైన మైక్ క్రెయిజర్, కెవిన్ సిస్ట్రోమ్‌లు ఫేస్‌బుక్‌కి గుడ్ బై చెప్పారు .

|

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులైన మైక్ క్రెయిజర్, కెవిన్ సిస్ట్రోమ్‌లు ఫేస్‌బుక్‌కి గుడ్ బై చెప్పారు . ప్రస్తుతం వీరు ఇన్‌స్టాగ్రామ్ సీఈఓగా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ పదవుల్లో ఉన్నారు.అయితే ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్ని వారాల్లో వీరిద్దరూ కంపెనీని వీడనున్న విషయాన్నీ ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సోమవారం తెలిపింది. అయితే వారు కంపెనీని ఎందుకు వీడుతున్నారో కారణం చెప్పలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఇంటర్నెట్‌లో మీకు బాగా ఉపయోగపడే బెస్ట్ వెబ్‌సైట్‌ల వివరాలు..ఇంటర్నెట్‌లో మీకు బాగా ఉపయోగపడే బెస్ట్ వెబ్‌సైట్‌ల వివరాలు..

ఒక బిలియన్ డాలర్లు పెట్టి ఫేస్‌బుక్‌ 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను కొనింది....

ఒక బిలియన్ డాలర్లు పెట్టి ఫేస్‌బుక్‌ 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను కొనింది....

ఇన్‌స్టాగ్రామ్‌ను 2010లో స్థాపించారు.ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక బిలియన్ డాలర్లు పెట్టి ఫేస్‌బుక్‌ 2012లో కొనింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల బాగా పాపులారిటీ పొందుతూ ఉంది. కొత్త కొత్త ఫీచర్లు అప్ డేట్ అవుతుండడంతో ఎక్కువ మంది ప్రముఖులు దీన్ని వాడటంతో దీనికి మరింత క్రేజ్ పెరిగింది.

రాజీనామాలపై సిస్ట్రోమ్‌ ఈ విధంగా  స్పందించారు...

రాజీనామాలపై సిస్ట్రోమ్‌ ఈ విధంగా స్పందించారు...

రాజీనామాలపై సిస్ట్రోమ్‌ ఈ విధంగా స్పందించారు. తమలో ఉన్న క్రియేటివిటీ ని మరోసారి వెలికితీసే పనిలో ఉన్నామని అందువల్లే ఫేస్‌బుక్‌కి రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

 

 

రాజీనామాలపై ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ ఈ విధంగా  స్పందించారు...

రాజీనామాలపై ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ ఈ విధంగా స్పందించారు...

రాజీనామాలపై ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ స్పందించారు. ‘కెవిన్‌, మైక్‌ అద్భుతమైన ప్రొడక్ట్‌ లీడర్లని ఇన్‌స్టాగ్రామ్‌ వారు క్రియేట్ చేసిందని ఈ ఆరేళ్లలో వారి వద్ద నుంచి చాలా నేర్చుకున్నాని తర్వాత ఏం చేస్తారో చూడాలి' అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.ఈ సందర్బంగా వాళ్లకు ఆల్‌ ది బెస్ట్‌ కూడా చెప్పారు .

 

 

రాజీనామా గల కారణాలు వేరే ఉన్నట్టు...

రాజీనామా గల కారణాలు వేరే ఉన్నట్టు...

ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్‌కు పలుమార్లు నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినట్టు అందుకే, వీరు రాజీనామా చేసినట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి.

Best Mobiles in India

English summary
Instagram co-founders resign with no explanation.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X