Home
News

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఎగిరి గెంతేసే ఫీచర్‌.. ముఖ్యంగా రీల్స్‌ ఎక్కువగా చూసేవారికి పండగే..!

Instagram Auto Scroll : మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ పాపులర్‌ ప్లాట్‌ఫాంలలో ఒకటిగా ఉంది. సెలబిట్రీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అనేక మంది ఇన్‌స్టాగ్రామ్‌ ను ఉపయోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా అదిరిపోయే ఫీచర్‌ ను తీసుకొస్తోంది. అయితే ఈ ఫీచర్‌ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుంది?

గంటల తరబడి ఇన్‌స్టా రీల్స్‌ :
కొంత మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ లో అప్‌డేట్స్‌ చూసుకొని లేదా ఏదైనా ఫోటో లేదా వీడియో పోస్ట్‌ చేసి వెళ్లిపోతుంటారు. అయితే కొంత మంది యూజర్లు గంటల తరబడి ఇన్‌స్టాలో రీల్స్‌ చూస్తుంటారు. చేతితో రీల్స్‌ స్క్రోల్స్‌ చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి వారికి ఇన్‌స్టా కొత్త ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుంది.

Instagram Auto Scroll

ఆటో స్క్రోల్‌ ఫీచర్‌ :
ఇన్‌స్టాగ్రామ్ ఆటో స్క్రోల్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు మాన్యువల్‌ గా రీల్స్‌ ను స్క్రోల్‌ చేయాల్సిన అవసరం ఉండదు. రోజులో ఎక్కువ సమయం రీల్స్‌ స్క్రోల్‌ చేసే యూజర్లు, ఇతర పనులు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించాలనుకొనే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం టెస్టింగ్‌లో :
ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. మరియు తొలుత ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాక.. ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ విడుదల అయ్యాక ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి.

Instagram Auto Scroll

ఐఫోన్‌ యూజర్లు తొలుత ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్‌ చేయాలి?
- అనంతరం రీల్స్‌ ఆప్షన్‌ పైన క్లి్క్ చేయాలి.
- ఏదైనా రీల్‌ ప్లే అవుతున్న సమయంలో అక్కడ కనిపించే 3 డాట్‌ మెనూ పైన క్లిక్‌ చేయాలి.
- అక్కడ కనిపించిన ఆటో స్క్రోల్‌ (Auto Scroll) ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
- ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన అనంతరం రీల్స్‌ ఆటోమేటిక్‌గా స్క్రోల్‌ అవుతాయి.

* ఇన్‌స్టాగ్రామ్‌ లో గతంలో ఫోటోలు అప్‌లోడ్ చేసే యూజర్లు కచ్చితంగా కొన్ని ఫార్మాట్స్‌ లోనే అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం మే నెలలో కొత్త ఫార్మాట్‌కు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి గతంలోనే వెల్లడించారు.

Take a Poll

కొత్త అప్‌డేట్ వచ్చేంత వరకు ఇన్‌స్టాలో కేవలం 1:1, 4:5 రేషియోలోనే ఫోటోలను అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం 3:4 యాస్పెక్ట్‌ రేషియోలోనూ అప్‌లోడ్‌ చేయవచ్చు. మొత్తంగా 1:1, 4:5, 3:4 యాస్పెక్ట్‌ రేషియోలలో ఫోటోలను అప్‌లోడ్‌ చేసేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది.

సాధారణంగా అనేక స్మార్ట్‌ఫోన్స్‌ కెమెరాలల్లో 3:4 డిఫాల్ట్‌ ఇమేజ్‌ సైజుగా ఉంటుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టా్లో అప్‌లోడ్‌ చేయాలంటే కచ్చితంగా క్రాప్‌ చేయాల్సి వచ్చేది. అయితే కొత్తగా 3:4 యాస్పెక్ట్‌ రేషియోను కూడా అనుమతించడంతో సులభంగా ఫోటోలను అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం కలిగింది. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్‌లకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
instagram currently testing auto scroll feature for reels, how to activate this feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X