ఇన్‌స్టాగ్రామ్‌లోకి సరికొత్త ఫీచర్, చెక్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

ప్రముఖ ఫేస్‌బుక్ సొంత యాప్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు రాసే స్టోరీల కోసం కొత్త చాట్ స్టిక్కర్ ను కంపెనీ లాంచ్ చేసింది. జాయింట్ చాట్ స్టిక్కర్ ఫీచర్ తో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు తమ స్టేటస్ పై పోస్టు చేసే స్టోరీలకు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చునని అధికారిక ట్వీట్ రివీల్ చేసింది.

Instagram introduces Join Chat sticker: Heres all you need to know

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ స్టోరీలకు స్టిక్కర్ యాడ్ చేయడమే కాదు.. మీ స్నేహితులకు కూడా యాడ్ అయ్యేలా రిక్వెస్ట్ పంపవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో డైరెక్ట్ మెసేజ్ ద్వారా చాటింగ్ చేసే సమయంలో స్నేహితులను స్టిక్కర్ యాడ్ చేసుకునేలా రిక్వెస్ట్ పెట్టవచ్చు. స్టోరీ పోస్టు చేసే సమయంలో అకౌంట్లో స్టిక్కర్ ట్రే ఓపెన్ చేస్తే చాలు.. అక్కడ జాయిన్ చాట్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ పై క్లిక్ చేసి మీ స్నేహితులతో కలిసి జాయింట్‌గా చాటింగ్ చేసుకోవచ్చు.

 సోషల్ మీడియా మాధ్యమాలను వెనక్కి నెట్టిన ఇన్‌స్టాగ్రామ్

సోషల్ మీడియా మాధ్యమాలను వెనక్కి నెట్టిన ఇన్‌స్టాగ్రామ్

ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలను వెనక్కి నెట్టి ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ట్రెండింగులో ఉంది. దీంతో సినీస్టార్లంతా ఇందులో ఖాతాలు తెరవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న ప్రమేయం లేకుండా అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ అకౌంట్లను తెరిచి అభిమానులకు దగ్గరయ్యారు. అందుకే ఇది సెలబ్రిటీల యాప్ గా మారిపోయింది.

 లిస్టులోకి రామ్ చరణ్

లిస్టులోకి రామ్ చరణ్

ఇక తెలుగు హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇందులోకి ఎంటర్ అవ్వగా... తాజాగా ఈ లిస్టులో రామ్ చరణ్ చేరారు. రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం'లో గడ్డం లుక్‌తో ఉన్న ఫోటోను ఈ సందర్భంగా చరణ్ పోస్ట్ చేశాడు. @alwaysramcharan పేరుతో ఈ ఖాతా ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5 గంటల్లోనే 50వేల మందికిపైగా ఆయన్ను ఫాలో అవ్వడం విశేషం.

1 మిలియన్ రీచ్ అవ్వడం ఖాయం
ఈ స్పీడు చూస్తుంటే ఒకటి రెండు రోజుల్లోనే 1 మిలియన్ రీచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలియగానే అభిమానుల మాదిరిగానే అక్కినేని హీరో అఖిల్ కూడా సర్‌ప్రైజ్ అయ్యాడు. 'వెల్‌కం టు ఇన్‌స్టా‌గ్రామ్ ఆర్‌సి... ఇదొక ప్లజంట్ సర్‌ప్రైజ్' అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు.

 

చాలా రోజుల తర్వాత

చాలా రోజుల తర్వాత

ఇప్పటి వరకు రామ్ చరణ్ కేవలం ఫేస్‌బుక్ అధికారిక ఖాతా మాత్రమే మెయింటేన్ చేస్తూ వచ్చాడు. గతంలో ట్విట్టర్ ఖాతా కూడా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఖాతాను క్లోజ్ చేశాడు. చాలా రోజుల తర్వాత చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖాతా ద్వారా చరణ్ తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకోనున్నారు.

 రాజమౌళి దర్శకత్వంలో RRR

రాజమౌళి దర్శకత్వంలో RRR

సినిమాల విషయానికొస్తే... రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు చరణ్ నిర్మాతగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Instagram introduces 'Join Chat' sticker: Here's all you need to know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X