ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలోనే స్నాప్ చాట్ తరహా ఫీచర్ రెడీ..

Posted By: M KRISHNA ADITHYA

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ మరో సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్‌కు చెందిన కొన్ని ఫీచర్లను ప్రవేశ పెట్టి విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా స్నాప్ చాట్ కు చెందిన పిక్చర్ షేరింగ్ యాప్ ను గతంలో ఇన్ స్టాగ్రామ్ లో ప్రవేశపెట్టగా, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ డబ్బ్‌డ్ నేమ్‌ట్యాగ్స్ ను ను కూడా ప్రవేశపెడుతోంది. అయితే ఈ కొత్త ఫీచర్ సైతం స్నాప్ చాట్ కు చెందినవిగానే భావిస్తున్నారు. స్నాప్ చాట్ 2015లో స్నాప్ కోడ్ పేరిట ఈ తరహా ఫీచర్ ను ప్రవేశ పెట్టింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఒక కస్టమ్ ట్యాగ్ ను ఎమోజీ పాటర్న్ ద్వారా క్రియేట్ చేసే వీలుంది. ఈ ట్యాగ్ ను ఏఆర్ బేస్డ్ సెల్ఫీ ద్వారా లేకపోతే రకరకాల కలర్స్ ఆప్షన్స్ తో క్రియేట్ చేసుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలోనే స్నాప్ చాట్ తరహా ఫీచర్ రెడీ..

ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన అనంతరం, యూజర్స్ కేవలం సదరు వ్యక్తి యొక్క నేమ్ ట్యాగ్ ను యాప్ కెమెరాతో స్కాన్ చేస్తే చాలు, ఎలాంటి టైపింగ్ చేయకుండానే టాగ్ చేసుకునే వీలు కలుగుతుంది. అప్పుడు ఎంచక్కా మీరు ఎంచుకున్న టాగ్ లో ఉన్న వ్యక్తిని ఫాలో అయిపోయవచ్చు. దీని ద్వారా పలువురు మిమ్మల్ని ఈజీగా ఫాలో అయ్యే వీలుంది.

3జిబి ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే ఫోన్ రూ. 10,990కే

అంతేకాదు ఒక సారి ఈ ఫీచర్ ను రిలీజ్ చేసిన అనంతరం కాలాగుణంగా మార్పులు ఉంటాయని, అందుకోసం ప్రజల ఫీడ్ బ్యాక్ పొందేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఫోటో షేరింగ్ సర్వీసు కొత్త పోస్టులు పబ్లిష్ చేసేందుకు ఒక బటన్ కూడా ఏర్పాటు చేసిందని తెలిపింది. ఇది ప్రెస్ చేయగానే కొత్త పోస్ట్ రిఫ్రెష్ చేసే వీలు కూడా కలుగుతుంది. దీని ద్వారా కొత్త అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.

అలాగే, మరో మార్పు కూడా ఈ సారి ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉంది. అదే క్రోనలాజికల్ టైమ్ లైన్ దీని ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు ఒక టైమ్ లైన్ ప్రకారం కనబడతాయి. గతంలో ఈ ఫీచర్ లేకపోవడం వల్ల ఇన్ స్టా గ్రామ్ పలు విమర్శల పాలయ్యింది. అయితే ఈ సారి ఈ లోపాన్ని సరిదిద్ది పాత ఫోటోలను ఓ క్రోనోలజీ ప్రకారం టైమ్ లైన్ చూసే వీలు కల్పించారు.

ఫేస్ బుక్ తరహాలో షేర్ చేసుకునే సౌకర్యం ఇన్ స్టా గ్రామ్ లో అందుబాటులో లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే టెక్ క్రంచ్ రిపోర్ట్ ప్రకారం సరిగ్గా ఇలాంటి ఫీచర్ ను కొత్త అప్ డేట్ లో పొందుపరచనున్నారు. యూజర్లు తమకు నచ్చిన స్టోరీలు, అప్ డేట్స్‌ను కోట్ చేసుకునే వీలు కల్పించారు. ఒక లాగా చెప్పాలంటే ఇది షేర్ చేసుకునే అవకాశంగా చెప్పవచ్చు.

English summary
Instagram might have a Snapchat-inspired feature soon More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot