ఇండియాలో ఇన్‌స్టా‌గ్రామ్ మ్యూజిక్ లాంచ్, పూర్తి వివరాలు మీకోసం

By Gizbot Bureau
|

ప్రముఖ షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్ ఇండియాలో సరికొత్త ఫీచర్ తో దూసుకువచ్చింది. ఇకపై ఇండియాలో ఇన్‌స్టా‌గ్రామ్ వాడే యూజర్లు తమకు నచ్చిన పాటల్ని స్టోరీస్ తో జోడించి ఆనందించవచ్చు. ఈ మేరకు ఇన్‌స్టా‌గ్రామ్ మ్యూజిక్ పేరుతో కొత్త ఫీచర్ ని ఇన్‌స్టా‌గ్రామ్ ఇండియాలో లాంచ్ చేసింది. కాగా గతేడాది మార్చిలోనే ఇన్‌స్టా‌గ్రామ్ ఈ సదుపాయాన్ని కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా భారత్ లోని యూజర్లు తాజా అప్ డేట్ ద్వారా ఈ ఫీచర్ ని పొందవచ్చు. యూజర్లు స్టోరీస్ ఆప్సన్ లో కెళ్లి అక్కడ కనిపించే స్టిక్కర్స్ బటన్ నొక్కితే ఈ ఫీచర్ కనిపిస్తుంది. అయినప్పటికీ అక్కడ మ్యూజిక్ ఆప్సన్ కనిపించక పోతే యూప్ ను డిలీట్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేయడం ద్వారా పొందవచ్చు. ఇన్‌స్టా‌గ్రామ్ లో వచ్చే ఈ మ్యూజిక్ లో పాపులర్ సాంగ్స్ , అలాగే మోడ్స్, జెనర్స్ ఇలా మూడు సదుపాయాలు ఉంటాయి. వాటి ద్వారా మీకు నచ్చిన పాటల్ని బ్రౌజ్ చేసి స్టోరీస్ కు జోడించుకోవచ్చు.

ఈ-కామర్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు

ఈ-కామర్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు

ఫేస్‌బుక్‌కు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా ఈ-కామర్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఇందుకోసం కొత్తగా చెల్లింపు బటన్‌ను తన యాప్‌లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి అమెరికాలో పరిమిత సంఖ్యలో వ్యాపార సంస్థలకు దీనిలో అవకాశం ఇచ్చింది. యాప్‌ బీటా వెర్షన్‌లో చూసిన వస్తువును అప్పటికప్పుడు డబ్బు చెల్లించి కొనుగోలు చేసే విధంగా దీనిని సిద్ధం చేశామని ఫేస్‌బుక్‌ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

ఒకే లైవ్‌లో ఎక్కువ మంది

ఒకే లైవ్‌లో ఎక్కువ మంది

ఇన్‌స్టాగ్రామ్ పెరిగిపోతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒకే లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనేలా కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. కాగా గత ఏడాది నవంబరులో లైవ్ వీడియో ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌‌ ప్రవేశపెట్టింది. దీంతో ఫోటోల కంటే లైవ్‌ల ద్వారానే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్లు షేర్ చేసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో నెటిజన్లకు లైవ్‌లో ఒకరు మాత్రమే పాల్గొనేలా కాకుండా.. ఒకే లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పించింది.

ఎలా యూజ్ చేయాలి 

ఎలా యూజ్ చేయాలి 

యాప్ అప్‌డేట్ చేసుకున్న తర్వాత లైవ్ చేసేటప్పుడు పక్కనే యాడ్ బటన్ వుంటుంది. దాని ద్వారా అప్పుడు లైవ్ చూస్తున్న వారిలో నచ్చిన వారిని లైవ్ చేయవచ్చు. వెంట‌నే మీ లైవ్ స్క్రీన్ భాగాలుగా విడిపోతుంది. ఆ భాగాల్లో గ్రూప్ లైవ్ చేస్తున్న వారంతా క‌నిపిస్తారు. స్నేహితులంద‌రూ క‌లిసి లైవ్ చేయాల‌నుకునే వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

డేటా సేవింగ్‌ ఫీచర్‌

డేటా సేవింగ్‌ ఫీచర్‌

దీంతో పాటుగా నెట్‌వర్క్‌ కవరేజ్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల వారికి మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఫీచర్‌ను రూపొందించింది. అదే డేటా సేవింగ్‌ ఫీచర్‌.. దీని ద్వారా నెట్‌వర్క్‌ కవరేజి తక్కువగా ఉన్న ప్రాంతాల వారు సైతం ఇన్‌స్టాగ్రామ్‌ను ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ అయిన ఫొటోలు, వీడియోలు ఎక్కువ రిజల్యూషన్‌ ఉన్నవి అవసరం అనుకుంటేనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

సెల్యులార్‌ డేటా యూసేజ్‌

సెల్యులార్‌ డేటా యూసేజ్‌

ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ తక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాలలో సైతం నిరంతరాయంగా పని చేస్తుంది. దీనిని అందుబాటులోకి తీసుకోవాలంటే 'అకౌంట్‌'లో 'సెల్యులార్‌ డేటా యూసేజ్‌' ఆప్షన్స్‌లో ఈ ఫీచర్‌ జత చేశారు. ఈ ఫీచర్‌ కావాలనుకునే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఆ ఆప్షన్‌ మార్చుకుంటే సరపోతుంది. ఈ ఫీచర్‌ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు వర్తిస్తుంది.

Best Mobiles in India

English summary
Instagram Music launched in India: All you need to know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X