Instagram కొత్త ఫీచర్, వాడితే! Tiktok ను మరచి పోతారు.

By Maheswara
|

భారతీయ సోషల్ మీడియా అప్ ల మార్కెట్లో టిక్‌టాక్ ని నిషేధించిన తరువాత, టిక్‌టాక్ లాంటి అప్ లు చాల వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.మరియు ఇప్పటికే బాగా పేరుమోసిన సోషల్ మీడియా అప్ లు టిక్‌టాక్ లాంటి ఫీచర్ లను అమర్చే పనిలో వేగంగా అడుగులు వేస్తున్నారు.

Instagram Reels

Instagram Reels

టిక్‌టాక్ ని మరిపించే దిశగా ఇన్‌స్టాగ్రామ్ తన కొత్త ఫీచర్ అయిన  'రీల్స్' ను భారతదేశంలోని కొంతమంది వినియోగదారులకు విడుదల చేసింది.టెస్టింగ్ కోసం విడుదల చేసిన దీనిలో అచ్చం టిక్‌టాక్ లాంటి ఫీచర్ లే ఉండటం ఆశ్చర్యపరిచే విషయమే.ఇన్‌స్టాగ్రామ్ కూడా తమ కొత్త 'Reels ' ఫీచర్ టిక్‌టాక్ కు పోటీ గానే విడుదల చేసినట్టు   అంగీకరించింది.

ఈ కొత్త ఫీచర్ తో

ఈ కొత్త ఫీచర్ తో

ఈ కొత్త ఫీచర్ తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌లు 15-సెకన్ల, లూపింగ్ వీడియో క్లిప్‌లను సృష్టించడానికి వీలు ఉంటుంది, ఇది సంగీతానికి అనుకరణగా అమర్చుకోవచ్చు , వివిధ క్లిప్‌ల తో కలిసి ఉంటుంది టిక్‌టాక్ లాగానే.ఈ Reels ఫీచర్ తో వీడియో లు షేర్ చేసుకోవచ్చు , రీమిక్స్ కూడా చేయవచ్చు.

Tiktok Ban

Tiktok Ban

భారత,చైనా  ప్రభుత్వాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా టిక్‌టాక్‌ను భారతదేశంలో నిషేధించడంతో, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ రెండింటికీ టిక్‌టాక్ మార్కెట్లో చోటు దక్కించుకునే అవకాశాన్ని కల్పించినట్లైంది.అంతే కాకా ఈ చిన్నవీడియో లకు వినియోగదారులతో పెరుగుతున్న ప్రజాదరణను తీర్చగలవు.ఈ  సంవత్సరం ఫిబ్రవరి నాటికి టిక్‌టాక్ భారతదేశంలో సుమారు 81 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఇటీవలి భారత్ ప్రభుత్వం ఈ అనువర్తనం ను  నిషేధించే సమయానికి సుమారు 200 మిలియన్ల మంది క్రియాశీల భారతీయ వినియోగదారులు  కలిగి ఉండవచ్చని నివేదిక.

 ఇన్‌స్టాగ్రామ్ కు పెరుగుతున్న ఆదరణతో

ఇన్‌స్టాగ్రామ్ కు పెరుగుతున్న ఆదరణతో

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కు  పెరుగుతున్న ఆదరణతో 'రీల్స్' ను అభివృద్ధి చేయడం లో  విజయం సాధిస్తుంది.గమనించదగ్గ విషయం ఏమిటంటే, యూట్యూబ్ కూడా  తన సొంత టిక్‌టాక్ లాంటి సాధనాన్ని 'షార్ట్స్' అని పిలుస్తోంది, ఇది త్వరలో భారతీయ మార్కెట్లో ప్రారంభించబడుతుందని చాలామంది భావిస్తున్నారు.
టిక్‌టాక్ భారతదేశంలో పునరుద్ధరించబడకపోతే, అది దీర్ఘకాలికంగా పెద్ద దెబ్బే,  ఎందుకంటే పోటీగా వచ్చిన అప్ లు చాలా వేగంగాఅభివృద్ధి చెందుతాయి. అంతే కాక టిక్‌టాక్ ను మరిచిపోవచ్చు కూడా. ఈ బ్యాన్ దెబ్బ నుండి టిక్‌టాక్ ఎంత త్వరగా కోలుకుంటే అంట మంచిది లేదంటే కొత్త అప్ లతో టిక్‌టాక్ ను మరచిపోతారనడం లో ఎటువంటి సందేహము లేదు.

Best Mobiles in India

English summary
Instagram Reels Launched in India: Similar to Tiktok Functionality.  

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X