Instagramలో స‌రికొత్త అప్‌డేట్‌.. ఈ ఫీచ‌ర్‌తో మీ స్టోరీకి అంద‌రూ ఫిదా!

|

మెటాకు చెందిన ప్ర‌ముఖ ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం Instagram తమ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ర‌క‌ర‌కాల కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేస్తోంది. తాజాగా ఇన్‌స్టా స్టోరీల‌కు సంబంధించి యూజ‌ర్ల‌కు మ‌రో శుభ‌వార్త చెప్పింది. స్టోరీల నిడివిని పెంచుతూ తాజాగా మ‌రో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ పరిచయంతో, వినియోగదారులు తమ స్టోరీ పోస్ట్‌లో వీడియోల పరిమితిని పెంచుకునే అవకాశాన్ని పొందుతారు.

 
Instagram

ఈ కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు ఒకే కథనం(స్టోరీ) లో 60 సెకన్ల నిడివి గల వీడియోలను పోస్ట్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ప్రస్తుతం, Instagram వినియోగదారులు తమ స్టోరీలో సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేయ‌డానికి అవ‌కాశం లేదు.. కేవ‌లం 15-సెకన్ల చిన్న క్లిప్‌లుగా మాత్ర‌మే పోస్ట్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

మెటా ప్రతినిధి Instagram స్టోరీకి సంబంధించిన‌ కొత్త అప్‌డేట్ విష‌యాన్ని ధృవీకరించారు. ప్రతినిధి మాట్లాడుతూ, "ఇప్పుడు, 15-సెకన్ల క్లిప్‌కు బదులుగా, మీరు మీ కథనాన్ని 60 సెకన్ల పాటు నిరంతరం ప్లే చేయవచ్చు." అని ఆయ‌న పేర్కొన్నట్లు టెక్ క్రంచ్ నివేదిక వెల్ల‌డించింది.

ఫొటో షేరింగ్ యాప్ Instagram రీల్స్ పేరుతో షార్ట్ వీడియోస్ అమ‌లు చేసినప్ప‌టి నుంచి యాప్ టిక్-టాక్‌తో పోటీ ప‌డుతోంది. అంతేకాకుండా త‌మ యాప్‌ను మరింత ఆకర్షణీయంగా మరియు ఇంటరాక్టివ్‌గా ఉంచడానికి కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యూజ‌ర్ల‌కు ఎలాంటి అంతరాయం లేకుండా మరిన్ని వీడియోలను పుష్ చేయాలనుకునే కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఈ కొత్త అప్‌డేట్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో, పూర్తి వీడియోను చూడటానికి నిరంతరం ట్యాప్ చేయాల్సిన వినియోగదారులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Instagram

అదేవిధంగా త‌మ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రీల్స్ మరియు ఇతర ఫార్మాట్‌ల మధ్య లైన్లను మెటా సంస్థ నెమ్మదిగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే, వీడియో పోస్ట్‌లను ఇప్పుడు రీల్స్‌గా అప్‌లోడ్ చేసే విధంగా అవ‌కాశాన్ని తీసుకువ‌చ్చింది. మ‌రోవైపు కంపెనీ ఇటీవల రీల్స్ స‌మ‌యాన్ని కూడా పెంచుతూ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. 60 సెకన్ల నుంచి 90 సెకన్లకు రీల్స్ స‌మ‌యాన్ని పెంచింది. దీనితో పాటు, యాప్ డెవలపర్లు కొత్త స్టోరీ లేఅవుట్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు స‌మాచారం.

కాగా, కంపెనీ ఓ వైపు రీల్స్ మ‌రియు వీడియోల విష‌యంలో అప్‌డేట్‌లు తీసుకువ‌స్తుండ‌గా.. మ‌రోవైపు ప‌లువురు ఇత‌ర యూజ‌ర్లు మాత్రం ఇన్‌స్టాను ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాంగా మాత్ర‌మే ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై ప‌లువురు యూజ‌ర్ల నుంచి కాస్త వ్య‌తిరేక‌త ఎదుర‌వుతున్న‌ట్లు స‌మాచారం.

Instagram

అదేవిధంగా, మీ Instagram హ్యాక్ అయింద‌ని భావిస్తే.. ఇన్‌స్టా నుంచి కొత్త లాగిన్ లింక్ పొంద‌డానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి:
* ముందుగా Instagram లాగిన్ పేజీని ఓపెన్ చేయాలి.
* Forgot Password లేదా గెట్ హెల్ప్ లాగింగ్-ఇన్ ఆప్షన్ పై నొక్కాలి.
* అనంత‌రం, మీరు మీ ఖాతాను రిజిస్ట‌ర్ చేసుకున్న ఇమెయిల్ లేదా మొబైల్ నంబ‌ర్ చిరునామా వివ‌రాల‌ను అక్క‌డ పేర్కొన్న బాక్సులో ఎంట‌ర్ చేయాలి. ఒకవేళ మీకు వివరాలు గుర్తులేకపోతే 'మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం సాధ్యం కాదుస అనే విష‌యాన్ని గ‌మ‌నించాలి.
* మీ మొబైల్ నంబ‌ర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత దాని కింద ఉన్న‌ సెండ్ లాగిన్ లింక్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.
* ఇప్పుడు, మీ ఇమెయిల్ లేదా మొబైల్‌కు కొత్త లాగిన్ లింక్ వ‌స్తుంది.
* ఇప్పుడు మీకు వ‌చ్చిన ఆ కొత్త లాగిన్ లింక్ పై నొక్కాలి.
* ఆ త‌ర్వాత మీకు కొత్త పాస్ వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవాల‌ని కోరుతూ ఓ పేజీ వ‌స్తుంది. అందులో మీరు కొత్త పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ ఎంట‌ర్ చేసి, స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. త‌ద్వారా పాస్‌వ‌ర్డ్ చేంజ్ ప్ర‌క్రియ పూర్తి అవుతుంది.
* ఇలా పాస్‌వ‌ర్డ్ చేంజ్ ప్ర‌క్రియ విజ‌య‌వంత‌మైన త‌ర్వాత మీ ఖాతా మీ నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చింద‌ని నిర్దారించుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
Instagram roll out new story feature to increase story post time.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X