Home
News

ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. టీనేజీ యూజర్ల కోసం ప్రత్యేకంగా PG-13.. పూర్తి వివరాలు..!

మెటాకు చెందిన పాపులర్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ కు (Instagram) భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, రీల్స్‌ పోస్ట్‌ చేయడం సహా అనేక అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు, పొందేందుకు వినియోగిస్తున్నారు. అయితే పెద్దలతోపాటు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిసున్నారు.

దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అయింది. దీంతోపాటు ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో చెడు ధోరణులు, చెడు కంటెంట్‌ కూడా ఎక్కువ అయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లపై ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉండేలా ఇన్‌స్టాగ్రామ్‌ అనేక చర్యలు తీసుకుంటోంది.

Instagram teen accounts default to PG13 to boost teens security full details

ఇందులో భాగంగా గత సంవత్సరం టీన్‌ అకౌంట్స్‌ను (Instagram Teen Accounts) తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. టీన్‌ అకౌంట్స్‌ను 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారికి కేటాయిస్తారు. ఈ అకౌంట్స్‌లో సెన్సిటివ్‌ కంటెంట్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని ఇన్‌స్టా గతంలోనే తెలిపింది. దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ టీన్‌ అకౌంట్స్‌పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది.

ప్రత్యేక ఏఐ టెక్నాలజీ :
అయితే కొత్త మంది చిన్నారులు వయస్సును తప్పుగా చూపి, సాధారణ అకౌంట్స్‌ను పొందుతున్నారని ఇన్‌స్టా గుర్తించింది. దీంతో వయస్సు ధ్రువీకరణ కోసం ప్రత్యేక ఏఐ టెక్నాలజీ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. అయితే తాజాగా టీనేజర్ల కోసం మంచి ఫీచర్‌ను తీసుకొచ్చింది.

తాజాగా మరో బెస్ట్ ఫీచర్‌ :
టీనేజీ యూజర్ల భద్రత కోసం ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా సినిమాల్లో ఉండే PG-13 నిబంధనలకు (Instagram PG13) అనుగుణంగా టీనేజీ అకౌంట్స్‌లో కంటెంట్‌పై పరిమితులు విధించనుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన యూజర్ల అకౌంట్స్‌ను ఆటోమేటిక్‌గా 13+ సెట్సింగ్స్‌లోకి వెళ్తాయని తెలిపింది.

తన న్యూస్‌రూం పోస్ట్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఈ వివరాలను వెల్లడించింది. సాధారణంగా PG-13 మార్గదర్శకాల ప్రకారం అసభ్య పదాలు, డ్రగ్స్‌ వినియోగం, అశ్లీల కంటెంట్‌, హింసాత్మక సన్నివేశాలను నియంత్రించనున్నాయి. అయితే ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేయలేరని, తల్లిదండ్రుల అనుమతితోనే ఇది సాధ్యమవుతుందని ఇన్‌స్టా తెలిపింది.

ఈ కొత్త ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్ ధశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా టీన్‌ అకౌంట్స్‌పై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని భావిస్తోంది. తొలుత ఫీచర్‌ అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టీనేజ్‌ అకౌంట్స్‌కు క్రమంగా అందుబాటులోకి వస్తాయి. ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సురక్షితమైన కంటెంట్‌ సహా టీనేజర్లపై ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉండేలా అనేక చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు భవిష్యత్‌లో మరిన్ని భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి వేళల్లో ఇన్‌స్టా వినియోగంపై నియంత్రణ ఉండేలా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Instagram teen accounts default to PG13 to boost teens security full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X