ఇన్‌స్టా నుంచి కీలక ఫీచర్.. అలాంటి ఫోటోలు పంపితే ఆటోమేటిక్‌గా బ్లర్ అవుతాయి..!
మెటా నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల రక్షణకు ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన చేసింది. లైంగిక వేధింపుల బారిన పడకుండా ఈ ఫీచర్ రక్షణ కల్పిస్తుందని తెలపింది. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసెజ్ (DM) ద్వారా నగ్న చిత్రాలను పంపినప్పుడు ఈ ఫీచర్ వాటిని ఆటోమేటిక్‌గా బ్లర్ చేస్తుందని సంస్థ తెలిపింది.
18 సంవత్సరాల వారి ఇన్‌స్టా ఖాతాల్లో (instagram new feature for teens) ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఉంటుందని, పెద్దలు కూడా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకొనేలా నోటిఫికేషన్‌లను పంపుతుందని తెలిపింది. ఈ ఫీచర్ ఈ తరహా ఫోటోలను పంపే ముందు పునరాలోచించేందుకు కూడా అనుమతి ఇస్తుందని తెలుస్తోంది.

మెషిన్ లెర్నింగ్ టూల్ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ఫోటోల పరిశీలన జరుగుతుందని తెలిపింది. ఇన్‌స్టా డైరెక్ట్ మెసేజ్‌లకు కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.
లైంగిక కుంభకోణాలు ఇతర మార్గాల్లో చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని వెల్లడించింది. ఫలితంగా టీనేజర్లను నేరస్థులు సంప్రదించడం కఠినతరం చేస్తున్నామని స్పష్టం చేసింది. లైంగిక దోపిడీలో భాగంగా నేరస్తులు డైరెక్ట్ మెసేజ్ మార్గంలో నగ్నచిత్రాలు పంచేలా అవతలి వారిని ఒప్పి్ంచే అవకాశం ఉందని తెలిపింది.
అయితే డబ్బులు రాకుంటే లైంగిక పరమైన అంశాల్లో తాము చెప్పినట్లు వినకంటే వారిని బహిర్గతం చేస్తామని బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. చాలా మంది నేరగాళ్లు చాలా సందర్భాల్లో సన్నిహిత ఫోటోలు పొందేందుకు డైరెక్ట్ మెసేజ్ ద్వారాను సంప్రదింపులు జరుపుతారు.
ఇలాంటి ప్రయత్నాలకు కొత్త ఫీచర్ చెక్ పెడుతుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్‌లో ఇటువంటి నగ్న చిత్రాలు పంపింతే ఆటోమేటిక్ గా బ్లర్ చేయనుంది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. నైట్‌టైం నడ్జెస్ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. అత్యధిక శాతం మంది యూజర్లు రీల్స్ చూస్తూ ఇన్‌స్టాలోనే గడిపేస్తున్నారు. పగటి పూట సహా అర్ధరాత్రి వేళల్లోనూ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు.
ఈ ప్రవర్తన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నైట్‌టైం నడ్జెస్ ఫీచర్ అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో అదే పనిగా 10 నిమిషాల పాటు గడిపినప్పుడు.. ఓ అలెర్ట్‌ను ఇన్‌స్టా జారీ చేస్తుంది. మీరు పరిమితికి మించి ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపారు, కాబట్టి యాప్‌ను క్లో్జ్ చేయమని హెచ్చరిస్తున్నట్లు ఓ అలెర్ట్‌ను ఈ ఫీచర్ జారీచేయనుంది.
ఈ అలెర్ట్‌తో వారి నిద్ర సమయాన్ని గుర్తుచేసినట్లు ఉంటుందని, ఫలితంగా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి నిద్రపోయే అవకాశం ఉంటుందని మెటా సంస్థ భావిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కారణంగా టీనేజర్లు సహా ఇతరులు నిద్రకు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు సహా కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications








