5000 ఉద్యోగాలకు ఇంటెల్ కోత

Posted By:

5000 ఉద్యోగాలకు ఇంటెల్ కోత

తమ కంప్యూటర్ చిప్‌ల వ్యాపారం క్షీణిస్తున్న నేపధ్యంలో ఖర్చులను తగ్గించేందకు ఈ 2014లో 5,000 ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు ఇంటెల్ కార్పొరేషన్ తెలిపింది. కాలిఫోర్నియాలోని సాంటా క్లారా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంటెల్ కార్పొరేషన్ శుక్రవారం ఈ వార్తను ధృవీకరించింది. 5,000 మంది ఉద్యోగులను తొలగించటం వల్ల కంపెనీకి ఎంత మొత్తం ఆదా అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ల విక్రయాలు రోజురోజుకు తగ్గిపోతున్న నేపధ్యంలో ఇంటెల్ చిప్‌లకు డిమాండ్ తగ్గుతోంది.

ఇండియాలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది భారీ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 16,000 మంది వరకు ఇంజనీరింగ్ అభ్యర్థులను తీసుకునే ప్రక్రియకు ఇన్ఫోసిస్‌ శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో అవుట్ సోర్సింగ్ సేవలను డిమాండ్ పెరిగిన నేపధ్యంలో కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వాస్తవానికి.. ఐటీని భవిష్యత్తుగా ఎంచుకన్న విద్యార్థులకు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకునే కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక చదవైపోగానే ఐటీ ఉద్యోగాలు దొరుకుతన్నాయా అనుకుంటే అదికూడా కష్టమైపోతోంది. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికి ఎందుకీ దుస్థితి..?

ఇటీవల వెల్లడైన ఓ సర్వే బిత్తరపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయట. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికి వారికి సరిపోయే సిబ్బంది దొరక్క చిక్కుల్లో పడుతున్నాయట. టెక్నికల్ విద్యలో పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం 8శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రావిణ్యాలను కలిగి ఉన్నారట.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot