ఇంటెల్ ల్యాప్ టాప్స్ దానం అలా ఉపయోగం..!!

Posted By: Super

ఇంటెల్ ల్యాప్ టాప్స్ దానం అలా ఉపయోగం..!!

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కొత్తగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విధ్యార్దుల కోసం ఐటి@స్కూల్ ప్రాజెక్టు అనే బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటి దిగ్గజం ఇంటెల్ కేరళలో ఉన్న ఐదు జిల్లాలకు చెందిన 6 గవర్మమెంట్ పాఠశాలలో చదువుకుంటున్న విధ్యార్దుల కొసం తన వంతు సహాయంగా 625 క్లాస్ మేట్ ల్యాప్ టాప్‌లను అందజేసింది.

కేరళ గవర్నమెంట్ ఐటి దిగ్గజం ఇంటెల్‌తో భాగస్వామ్యంతో ఆయా జిల్లాల్లో తలపెట్టిన స్మార్ట్ స్కూల్ ప్రాజెక్టు(ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్)లు విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. దేశం మొత్తం మీద మొట్టమొదటి సారి ఈ ఐటి@స్కూల్ ప్రాజెక్టుని ప్రారంభించిన రాష్ట్రంగా కేరళ చరిత్రకెక్కింది. ఈ మహాత్తర కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇలాంటి ఐటి@స్కూల్ ప్రాజెక్టులకు కేరళ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలిపారు.

ఈ ఐటి@స్కూల్ ప్రాజెక్టు కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం స్టూడెంట్స్‌తో పాటు టీచర్స్‌కి కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సంవత్సరానికి రెండు లక్షల టీచర్స్‌తో పాటు, ఐదు మిలియన్ స్టూడెంట్స్ లభ్ది పోందనున్నారని తెలిపారు. ఈ సందర్బంలో ఐటి@స్కూల్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్వర్ సాధా మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లలో మొబైల్ కంప్యూటింగ్ కూడా ముఖ్య పాత్రని పోషిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్‌కి, టీచర్స్‌కి కొంత కాలం వరకు ల్యాప్ టాప్‌లను ఇవ్వడం జరుగుతుందన్నారు. స్టూడెంట్స్ వాటిని ఇళ్లకు కూడా తీసుకొవి వెళ్లేటటువంటి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. దీంతో స్టూడెంట్స్ వీటిని ఎక్కవ సేపు ఉపయోగించడమే కాకుండా ఐటి@స్కూల్ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలను ఈజీగా తెలుసుకొవచ్చన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot