ఇంటెల్ అద్భుత సృష్టి.. ఇక పై చేయి ఊపుడే పాస్ వర్డ్!

Posted By: Staff

 ఇంటెల్ అద్భుత సృష్టి.. ఇక పై చేయి ఊపుడే పాస్ వర్డ్!

 

 

సాధారణంగా మెయిల్.. ఫేస్‌బుక్ ఇతర ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్‌లలోకి లాగిన్ అవ్వాలంటే తప్పనిసరిగా పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.  రాబోయే కాలంలో ఇలా పాస్‌వర్డ్‌లను టైప్ చేయాల్సిన అవసరం రాదు. జస్ట్ ‘మీ చేయిను ఊపితే చాలు’.

ఈ సరికొత్త అద్భుతాన్ని చిప్ మేకర్ ఇంటెల్ ఆవిష్కరించింది. ప్రోటోటైమ్ బయోమెట్రిక్ సెన్సార్ టెక్నాలజీ ఆధారితంగా డిజైన్ కాబడిన ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇంటెల్ శాస్త్రవేత్తలు మరింత అభివృద్ధి చేస్తున్నారు.  ఈ విధానం ద్వారా యూజర్ తన అరచేయిని ఊపితే చాలు తన ఐండెంటిటీ నిర్ధారణ అవుతుంది. ల్యాప్‌టాప్, లేదా ట్యాబ్లెట్ కంప్యూటర్‌లో అమర్చిన బయోమెట్రిక్ సెన్సర్.. యూజర్ ఐడెంటిటీని గుర్తించడానికి అతని చేతిలోని రక్తనాళాల అమరికను స్కాన్ చేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల వెబ్‌సైట్ల కోసం ఎన్నెన్నో పాస్‌వర్డ్‌లు వాడాల్సిన అవసరం ఉండదు.  ‘పాస్‌వర్డ్‌ల నిబంధనలు సంక్లిష్టం. ఒక్కో వెబ్‌సైట్‌కు మారిపోతుంటాయి. ఈ ఇబ్బందులు గట్టెక్కడానికి బయోమెట్రిక్ ఒక అవకాశం’ అని ఇంటెల్ ల్యాబ్ పరిశోధక విభాగం డెరైక్టర్ శ్రీధర్ అయ్యంగార్ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot