Home
News

5G టెక్నాలజీ ప్రొసెసర్ ల్యాప్‌టాప్‌లను అందించే ప్రయత్నంలో ఇంటెల్‌ & మీడియాటెక్

ప్రస్తుతం మీరు వాడుతున్న ల్యాప్‌టాప్‌లు మరియు డెస్క్ టాప్‌లలో ఏదైనా గేమ్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నారా లేక వేగంగా బ్రోజ్ చేయలేకపోతున్నారా దీనికి పరిష్కారం కోసం త్వరలో ఇవి కూడా 5G మద్దతుతో రాబోతున్నాయి అని సమాచారం. ఇందుకోసం ప్రముఖ తైవానీస్ చిప్‌మేకర్ 5G మోడెమ్‌లను తయారుచేస్తున్నట్లు తెలిపారు.

మీడియాటెక్

మీడియాటెక్ సంస్థ యొక్క కొత్త 5G మోడెమ్‌లను PC మరియు ల్యాప్‌టాప్‌లకు అందివ్వడానికి ఇంటెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తైవానీస్ చిప్‌మేకర్ తెలిపారు. ఇంటెల్ మరియు మీడియాటెక్ యొక్క 5G సొల్యూషన్ ల్యాప్‌టాప్‌లను అందించే మొదటి తయారీదారులలో డెల్ మరియు హెచ్‌పి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరికరాల యొక్క మొదటి రోల్ అవుట్ 2021 ప్రారంభంలో ఉంటుందని మీడియాటెక్ తెలిపింది.

 

ఇంటెల్

ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటెల్ సంస్థ మీడియాటెక్‌తో కలిసి వినియోగదారులకు 5G అనుసంధానిత కీలకమైన వాణిజ్య ల్యాప్‌టాప్ విభాగాలలో విస్తరణ కోసం పనిచేస్తోంది. ఇప్పుడు మీడియాటెక్ 5G మోడెమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఎదురయే సమస్యల పరిష్కారం కోసం చాలా మంది భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.

 

ఇంటెల్ భాగస్వామ్యంతో

ఇంటెల్ భాగస్వామ్యంతో కొత్తగా తయారుచేస్తున్న పిసిల కోసం 5G మోడెమ్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ కొత్త 5G మోడెమ్‌ను గృహ మరియు మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంచడానికి తయారుచేస్తున్నాము అని మీడియాటెక్ ప్రెసిడెంట్ జో చెన్ అన్నారు.

 

5G మోడెమ్

ఇంటెల్ మరియు మీడియాటెక్‌ యొక్క భాగస్వామ్యంతో వినియోగదారులు వారి PCలను ప్రస్తుతం వాడుతున్న దాని కంటే ఇంకా వేగంగా బ్రౌజ్ చేయగలరు, స్ట్రీమ్ చేయగలరు మరియు గేమ్స్ కూడా వేగంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఆడగలుగుతారు. 5G మోడెమ్ వినియోగంలోకి వచ్చిన తరువాత మీరు ఉహించని విధంగా 5G తో కొత్త అనుభూతిని పొందుతారని మేము ఆశిస్తున్నాము అని మీడియాటెక్ ప్రెసిడెంట్ చెన్ చెప్పారు.

 

5G కనెక్టివిటీ

మీడియాటెక్ సంస్థ 5G కనెక్టివిటీల కోసం చిప్ లను తయారుచేస్తున్నది. ఇందులో భాగంగా 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల మొదటి వేవ్ కోసం ఇంటిగ్రేటెడ్ 5G సిస్టమ్-ఆన్-చిప్‌లో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో హెలియో M70 5G మోడెమ్‌ను ప్రవేశపెట్టినది.

5G కంప్యూటింగ్

ల్యాప్‌టాప్‌లలో కొత్త స్థాయి 5G ఆధారంగా కంప్యూటింగ్ మరియు కనెక్టివిటీని రెండిటిని విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. దీని ద్వారా ప్రపంచంతో సంభాషించే విధానం కూడా మారుతుంది అని ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు క్లయింట్ కంప్యూటింగ్ గ్రూప్ జనరల్ మేనేజర్ గ్రెగొరీ బ్రయంట్ అన్నారు .

Best Mobiles in India

English summary
Intel To Offer 5G Chipset Support To Laptops By Collaborating With MediaTek
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X