మార్కెట్లోకి ఇంటెల్‌ జియాన్‌ ప్రాసెసర్‌ ఈ 7

Posted By: Staff

మార్కెట్లోకి ఇంటెల్‌ జియాన్‌ ప్రాసెసర్‌ ఈ 7

మెరుగైన పనితీరు, విశ్వసనీయత, భద్రతతో కూడిన సర్వర్‌ ప్రాసెసర్లను ఇంటెల్‌ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మిషన్‌ క్రిటికల్‌ కంప్యూటింగ్‌ యాక్సిలరేట్‌ చేసేలా ఇవి రూపుదిద్దుకున్నాయి. నూతన రికార్డులు నెలకొల్పేలా రూపుదిద్దుకున్న ఇంటెల్‌ జియాన్‌ ప్రాసెసర్‌ ఈ 7 8800/4800/2800 ఉత్పాదనలు ఇంటెల్‌ గత తరం సర్వర్‌ ప్రాసెసర్ల కన్నా మరింత మెరుగైనవి. బిజినెస్‌ ఇంటలిజెన్స్‌, రియల్‌ టైమ్‌ డేటా అనలిటిక్స్‌, విర్చువలైజేషన్‌లతో సహా హైఎండ్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్స్‌ నూతన ప్రమాణాలు నెలకొల్పేలా ఇవి రూపుదిద్దుకున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting