AP&TS రైతుల కోసం ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్ టెక్నాలజీ

|

ఇండియా మొత్తం ఎప్పటి నుంచో వినిపిస్తున్న నినాదం ఒకటే జై జవాన్-జై కిసాన్. రైతు అనే వాడు చల్లగా ఉంటే దేశం మొత్తం బాగా ఉంటారు అని అందరికి అర్థం అయింది. అందుకోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. రైతులకు నిపుణుల సహాయాలను అందించడానికి మరియు నష్టాలను అంచనా వేయడానికి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

పోషకాహారం
 

మానవులు పోషకాహారం లోపం కారణంగా వ్యాధుల బారిన ఎలా పడుతున్నారో మొక్కలలో కూడా పోషకాల లోపం ఉంటుంది. ఈ పోషకాల లోపం అన్ని మొక్కలలో ఒకే విధంగా ఉండదు. అది తెలియకుండా జనాలు ఎక్కువగా పురుగుల మందులను తమ ఇష్టానుసారంగా ఎక్కువగా చల్లుతున్నారు.

200GB డాటా ప్రయోజనంతో BSNL Rs.698 ప్రీపెయిడ్ STV ప్లాన్

రైతులు

తరతరాలుగా రైతులు తమ పంటను కాపాడుకోవడనికి విచక్షణారహితంగా ఇష్టానుసారంగా ఎక్కువ పురుగుల మందులను ఉపయోగించి అధిక మొత్తంలో డబ్బును వృధాగా ఖర్చు చేస్తున్నారు. దీని కారణంగా భూమి మొత్తం ఇప్పుడు ఎక్కువగా మందులతో నిండిపోయి ఉంది. దీని వలన ఎక్కువ మంది పంటలో లాభాలను చూడక నష్టాలను చూస్తున్నారు.

యాడ్-ఆన్ ప్యాక్‌లపై ధర తగ్గింపును ప్రకటించిన టాటా స్కై

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో పురుగుమందులు మరియు ఎరువులు పిచికారీ చేయడం ద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి సుమారు 5,000 ఎకరాల పంటలను లక్ష్యంగా చేసుకొని స్టార్టప్ అనే సంస్థ మారుట్ డ్రోనెటెక్ టెక్నాలజీను ఉపయోగిస్తున్నది.

 డ్రోన్ టెక్నాలజీ
 

రైతులు ఎరువులను ఎంత మొత్తంలో ఉపయోగించాలో తెలియక పంట దిగుబడి విషయంలో నష్టపోతున్నారు. పురుగుల మందులను అధిక మొత్తంలో వాడటం వలన అది నేల యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం వలన పొలంలో ఏది ఆరోగ్యకరమైన మొక్క మరియు ఏది రోగం బారిన పడిన మొక్క అని మేము వేరుగా చెప్పగలం అని మురుత్ డ్రోంటెక్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ తెలిపారు.

Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!

ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్

ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల బృందం వ్యవసాయాన్ని లక్ష్యంగా చేసుకుని తెలివైన అటానమస్ స్ప్రేయింగ్ డ్రోన్‌ టెక్నాలజీను అభివృద్ధి చేసారు. తక్కువ ఎత్తులో గంటకు 40 కి.మీ ప్రయాణించగల డ్రోన్‌లను ఉపయోగించి స్టార్టప్‌లు డేటాను సేకరించి ఎరువుల స్ప్రేల కోసం పంటలను విశ్లేషించడానికి మరియు మ్యాప్ తయారుచేయడానికి కేవలం ఒక గంట సమయం పడుతుంది. మరొక డ్రోన్ అది తయారు చేసిన డేటాను ఆధారంగా చేసుకొని ముందే నిర్దారించిన మార్గాన్ని ఉపయోగించి పురుగు మందులను చల్లడం చేస్తుంది.

జిహెచ్ఎంసి

రైతు వేసిన పంటలో అధికంగా వున్న పురుగు యొక్క లార్వా శాతాన్ని గుర్తించడానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కు సహాయపడటానికి స్టార్టప్ ఇలాంటి పద్ధతులను ఉపయోగించింది. ఇలా చేయడం ద్వారా స్ప్రే చేసే సందర్భాలను తగ్గించడంతో పాటు సమయం మరియు డబ్బు రెండు ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది.

స్ప్రేయింగ్ డ్రోన్‌లు

ఎరుపు, ఆకుపచ్చ నీలం కలర్ లలో ఉన్న హైపర్ అటానమస్ స్ప్రేయింగ్ డ్రోన్‌లు శక్తివంతమైన సెన్సార్‌లను గుర్తించడానికి మల్టీ-స్పెక్ట్రల్ కెమెరాలు దాని కింద ఉంచబడ్డాయి. డ్రోన్ కింద అమర్చిన ఈ కెమెరా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తుంది. ఒక నిర్దిష్ట రంగంలో పోషకాహార లోపాలు మరియు వ్యాధులను మ్యాప్ చేయడాన్ని ఇది విశ్లేషిస్తుంది. ఇది అవసరమైన పేలోడ్‌తో గైడెడ్ సోర్టీని తయారుచేస్తుంది. అంతేకాకుండా అవసరమైన చోట ఎంత మొత్తాలను పిచికారీ చేయాలో డేటాను తెలుపుతుంది. డ్రోన్ ఒక నిర్దిష్ట ప్రాంతంలో టార్గెట్ స్ప్రే చేయడానికి తక్కువ ఎత్తులో అంటే సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. స్టార్టప్ ప్రస్తుతం తమ సేవలను అందించడానికి ఇన్పుట్ తయారీదారులు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

పంట బీమాలో డేటా సేకరణ కోసం

పంట బీమాలో డేటా సేకరణ కోసం

బీమా చేసిన పొలాలలో నష్టాలను అంచనా వేయడానికి డ్రోన్ల ద్వారా సేకరించిన డేటా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రేమ్ చెప్పారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) యొక్క ఆర్థిక సహాయం పొందడానికి మొదటిగా ఎంత నష్టం వచ్చిందో గుర్తించడానికి డ్రోన్ ఇమేజింగ్‌ను ఉపయోగించడంతో పాటు రిమోట్ సెన్సింగ్‌తో సహా ఎక్స్‌పోనెన్షియల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఆర్థిక సహాయం పొందే విషయంలో సమయం ఆదా అవుతుంది. డ్రోన్ ఫీడ్లను సాక్ష్యంగా పట్టుకోవడం ద్వారా రైతులు త్వరగా బీమా క్లెయిమ్ చేయవచ్చు. భీమా సంస్థలకు నష్టాలను అంచనా వేయడానికి మరియు దావాలను క్రాస్ చెక్ చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Intelligent Spraying Drones to Help Farmers Target Specific Crop Areas in Telangana and AP

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X