Just In
Don't Miss
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Movies
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Lifestyle
Marriage Tips: మీ మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఈ పదాలను రెగ్యులర్ గా చెప్పాలంట...!
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL కొత్తగా లాంచ్ చేసిన రూ.699 వోచర్ గురించి ఆశక్తికరమైన విషయాలు...
ప్రభుత్వ ఆద్వర్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచర్ నిగం లిమిటెడ్ తన యొక్క వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడానికి ఇప్పుడు కొత్తగా మరొక వోచర్ ను దేశవ్యాప్తంగా అందిస్తున్నది. రూ.699 ధర వద్ద కేరళా ప్రాంతంలో లభించే ఈ వోచర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిల్ లలో లభిస్తున్నది. ఇది కొత్త వోచర్ కాదు అని గమనించాలి. కేరళ సర్కిల్ లో ప్రభుత్వ టెల్కో ప్రారంభంలో ఈ ఓచర్‌ను ప్రారంభించింది. ఈ వోచర్ యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.699 వోచర్ ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.699 వోచర్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది యూజర్లకు 0.5GB రోజువారీ FUP డేటాను అందిస్తుంది. దీని తరువాత వినియోగదారులు 80Kbps వేగంతో డేటాను పొందవచ్చు. దీనితో పాటు వినియోగదారులు ఎటువంటి FUP పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 160 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి మరియు మెసేజ్ లను పంపడానికి మొబైల్ కనెక్షన్‌ను ఉపయోగించే వారికి ఈ ప్లాన్ గొప్ప ఎంపికగా ఉంటుంది. ఇది నేటి నుంచి అంటే జనవరి 25, 2021 నుండి ఆఫర్లో ఉంటుంది.

BSNL రూ.699 వోచర్ ను పొందే విధానం
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.699 వోచర్ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడానికి వినియోగదారులు సంస్థ యొక్క వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు లేదా యుఎస్ఎస్డి కోడ్ ‘* 444 * 699 #' ను ఉపయోగించవచ్చు. PLAN BSNL699 ఫార్మాట్లో 123 కు SMS పంపడం ద్వారా కూడా వినియోగదారులు ఈ ప్లాన్ ను పొందవచ్చు. కానీ ప్రస్తుత యూజర్లు మెసేజ్ ను పంపే ముందు తమకు తగినంత బ్యాలెన్స్ ఉందని నిర్ధారించుకోవాలి.

BSNL ఉచిత 4G సిమ్ ఆఫర్
బిఎస్ఎన్ఎల్ టెల్కో ప్రస్తుతం కేరళలోని వినియోగదారులకు ప్రస్తుతం 4G సిమ్ కార్డును ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది జనవరి 31, 2021 వరకు పరిమిత సమయంలో ప్రమోషనల్ ఆఫర్ కింద వరకు లభిస్తుంది. ఈ ఉచిత 4G సిమ్ కార్డును పొందడానికి వినియోగదారుడు చేయాల్సిందల్లా మొదటి రీఛార్జ్ కూపన్ (FRC) కోసం రూ.100 లేదా అంతకంటే ఎక్కువతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఈ షరతుతో వినియోగదారులు BSNL నుండి ఉచిత సిమ్ కార్డును పొందగలరు.

BSNL vs ఎయిర్టెల్ vs Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లు
భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు తమ యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా తక్కువ ధరలో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇవి కేవలం 50GB వరకు మాత్రమే డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.250 పోస్ట్‌పెయిడ్ మొబైల్ డేటా ప్లాన్ ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ డేటా బెనిఫిట్లలో అందరికంటే అధికంగా 70GB వరకు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్ కనెక్షన్ ద్వారా డేటాను అధికంగా వినియోగించే వినియోగదారులకు ఈ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లు అధికంగా ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190