గూగుల్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా, పుట్టినరోజు స్పెషల్ కథనం !
ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్.
ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. కోటానుకోట్ల సెర్చ్ పేజీలు.. లెక్కకు మించిన అప్లికేషన్లు.. వందల కోట్ల సంఖ్యలో వినియోగదారులు... లక్షల కోట్ల డాలర్ల టర్నోవర్...ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ గురించి చాలానే ఉంది.నేడు 20వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు
గూగుల్ వ్యవస్థాపకలు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు
ఓ గూగుల్ ఉద్యోగి మరిణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను
2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు
ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

ఆదాయం
అడ్వర్టైజింగ్ విభాగంలో ఏటా గూగుల్ అర్జిస్తున్న ఆదాయం 20 బిలియన్ డాలర్ల పైమాటే..ఇది మూడేళ్ల క్రితం లెక్కలు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది.

జీమెయిల్
గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.
జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

స్మార్ట్ కంప్యూటర్
గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్
అత్యధిక మంది వీక్షించే వెబ్‌సైట్‌గా గూగుల్ గుర్తింపు తెచ్చుకుంది.2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ 40 శాతానికి పడిపోయింది.

నెలకు రెండు కంపెనీలు చొప్పున
2010 నుంచి గూగుల్ నెలకు రెండు కంపెనీలు చొప్పున కొనుగోలు చేస్తూ వస్తోంది.

20 మిలియన్ డాలర్లు
2016 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చంద్రమండలం పై ల్యాండ్ కాగలిగే ఏ జట్టుకైనా 20 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గూగుల్ తెలపింది.

గూగుల్ వెబ్ పేజీల లోడ్
గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది.

200 కారకాలను
ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది.

గూగుల్‌ను స్థాపించిన తేదీ
లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లలో ఎవరూ కూడా తాము గూగుల్‌ను స్థాపించిన తేదీని గుర్తుపెట్టలేదు. ఫలితంగా దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని మొదట్లో సెప్టెంబర్ 26, ఆ తర్వాత సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8 తేదీల్లో జరిపేవారు.

వికీ పేజ్‌లో చూస్తే..
ఇక గూగుల్‌కు చెందిన వికీ పేజ్‌లో చూస్తే దాని వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 4, 1998 అని ఉంటుంది. ఈ క్రమంలో ఒక నిర్దిష్ట తేదీ నాడే గూగుల్ బర్త్ డే జరపాలని ఆ కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో 2006 నుంచి సెప్టెంబర్ 27వ తేదీన గూగుల్ బర్త్ డేను నిర్వహిస్తూ వస్తున్నారు.

గూగుల్ పేరెలా వచ్చింది?
గూగుల్ అనే పదం గూగోల్ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య.కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.

2000 సంవత్సరంలో...
మే 9,200న 10 భాషలతో కూడిన సెర్చింజిన్ గూగుల్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దాదాపు 150 పైచిలుకు భాషల్లో గూగుల్ లభ్యమవుతోంది. జూన్ 2000 గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌లాగా అవతరించింది. డిసెంబర్ 2000 గూగుల్ టూల్ బార్ ప్రవేశపెట్టారు.

గూగుల్ ఇమేజెస్
జూలై 2001 గూగుల్ ఇమేజెస్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాదాపు 250 మిలియన్ల ఇమేజెస్ గూగుల్‌లో ఉన్నాయి. ఇదే అతి పెద్ద ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ వెబ్ డిసెంబర్ 2001 గూగుల్ మొదటి వార్షికొత్సవం జరిగింది. సంవత్సరంలో లక్షల మంది ప్రజలు గూగుల్ లో ఏమి వెతికారు అన్నదానిపై కూడా చర్చ జరిగింది.

3బిలియన్ డాలర్లు ఆఫర్
ఒక దశలో గూగుల్ కంపెనీని యాహూ కొనాలని చూసింది. 3బిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌ను గూగుల్ తిరస్కరించింది. ఈ ఏడాది గూగుల్ విలువ అప్పుడు పలికిన దానికి 200 రెట్లు ఉంది.

లూన్ ప్రాజెక్టు
జూన్ 2013 లూన్ ప్రాజెక్టుని గూగుల్ చేపట్టింది. అలాగే జులై 2013న మొబైల్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్‌ను రిలీజ్ చేసింది.

గూగుల్ మ్యాప్
జూలై 2014 గూగుల్ మ్యాప్‌ను హిందీలో లాంచ్ చేసారు.సెప్టెంబర్ 2014న ఆండ్రాయిడ్ వన్ ఇండియాలో ఆపరేటింగ్ సిస్టం ఇండియాలో లాంచ్ అయ్యింది. అక్టోబర్ 14న గూగుల్ వాయిస్‌ను ఇండియాలోకి తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








