ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

By Sivanjaneyulu
|

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతున్నాయి. స్మార్ట్ కమ్యూనికేషన్ నిత్యావసరంగా మారిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు విస్తరిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దేశవాళీ బ్రాండ్‌లకు ధీటుగా చైనా బ్రాండ్‌లు తమ సత్తాను చాటుతున్నాయి. లెనోవో, షియోమీ, లీఇకో వంటి బ్రాండ్‌లు తక్కువ ధరల్లో హై స్పెక్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆక్టట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం రేకెత్తిస్తోన్న పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‍‌లో చూడొచ్చు...

Read More : రూ.4,000 డిస్కౌంట్‌తో Le 1S Eco

 ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకుంది. భారత్‌లో 100కు పైగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు రూ.10,000 రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ ఓ ప్రముఖ మీడియాలకు వెల్లడించారు.

 ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

చైనా బ్రాండ్ లీఇకో తన మొట్ట మొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లీ1ఎస్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆసక్తికర స్పెసిఫికేషన్‌లతో విడుదలైన ఈ ఫోన్‌కు భారతీయులు బ్రహ్మరథం పట్టారనే చెప్పుకోవాలి. భారత్‌లో 2 లక్షలకు పై లీ1ఎస్ యూనిట్‌లను విక్రియించినట్లు లీఇకో చెబుతోంది. మరో ఆస్తక్తికర విషయం ఏంటంటే లీ1ఎస్ ఫోన్ తయారీకి రూ.16,042 ఖర్చు అయ్యిందని, ప్రత్యేక డిస్కౌంట్‌ల పై ఫోన్‌ను రూ.10,999కే అందించామని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితులు చూస్తేంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు నష్టాలను సైతం ఎదుర్కొనేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

భారత దేశపు నెం 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇటీవల తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎదుగుదల లోపించటంతో సర్వీసెస్ బ్రాండ్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, టీవీలు ఇంకా టాబ్లెట్‌లను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.

 ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాణిజ్య ప్రకటనల పై పూర్తిగా దృష్టిసారిస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్, సినిమా, టీవీ షో ఇలా ఏ ఒక్క ఈవెంట్‌ను వదలిపెట్టకుండా టార్గెటెడ్ యాడ్స్‌తో జనంలో హాట్ టాపిక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.

 ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

వర్చువల్ రియాల్టీ హ్యాండ్‌సెట్‌లకు క్రేజ్ పెరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త ఫోన్‌లతో పాటు వీటిని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. వర్చువల్ రియాల్టీ టెక్నాలజీకి భారతీయులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతోన్న నేపథ్యంలో ఈ మార్కెటింగ్ ట్రిక్ బాగానే వర్క్ అవుట్ అవుతుంది.

 ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

రూ.1000లోపే స్మార్ట్‌ఫోన్ అంటూ ఇటీవల మార్కెట్లో సంచలనంగా నిలిచిన ఫ్రీడమ్ 251, డోకోస్ ఎక్స్1 వంటి చీప్ క్వాలిటీ బ్రాండ్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల నాణ్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Interesting Facts about India’s smartphone market. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X