కీబోర్డు గురించి ఆసక్తికర నిజాలు!
కీబోర్డు పై అక్షరాలు వరస కమ్రంలో ఎందుకుండవ్..?. ఈ సందేహం కంప్యూటర్ ను ఆపరేట్ చేసే ప్రతి ఒక్కరిలోనే ఉదయిస్తుంటుంది. సాధారణంగా మనం ఉపయోగిస్తున్న కీబోర్డును ‘క్వర్టీ కీబోర్డ్'అని పిలుస్తారు. ఈ పేరు ఏలా వచ్చిందంటే కీ బోర్డు పై వరసలో ఉన్న ఆరు అక్షరాలు q,w,e,r,t,yకాబట్టి ఆ పదాలను కలిపేసి క్వర్టీ గా పిలుస్తున్నాం.
క్వర్టీ కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ డిజైన్ చేసారు. క్వర్టీ కీబోర్డు రూపకల్పనకు ముందు A,B,C,Dలతో కూడిన వరస అక్షరాల కీబోర్డు వాడుకలో ఉండేది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
అయితే ఈ కీబోర్డు వాడుకలో పలు ఇబ్బందులను గమనించిన క్రిస్టోఫర్ క్వర్టీ కీబోర్డు రూపకల్పనకు పూనుకున్నారు. ఆంగ్ల భాషకు సంబంధించి వాఖ్య నిర్మాణంలో భాగంగా కొన్ని అక్షరాలు ఎక్కువ సార్లు, మరికొన్ని అక్షరాలు చాలా తక్కువ సార్లు వస్తుంటాయి.
ఉదాహరణకు Q,Z,W,X వంటి అక్షరాల వాడుక తక్కువుగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే క్వర్టీ కీబోర్డు.. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానల్లో ఏర్పాటు చేసినట్లు ఉంటుంది.


Click it and Unblock the Notifications








