విప్లవాత్మక ఫీచర్లతో ‘Bluetooth’ కొత్త వర్షన్

Written By:

బ్లుటూత్ స్టాండర్డ్స్‌ను ఎప్పటికప్పుడు అభివృద్థి చేసే స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) బ్లూటూత్ భవిష్యత్ అప్ డేట్ కు సంబంధించిన వివరాలను అనౌన్స్ చేసింది. తరువాతి వర్షన్ బ్లుటూత్లో చోటుచేసుకునే విప్లవాత్మక మార్పులు , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా కనెక్ట్ కాబడే స్మార్ట్ కంప్యూటింగ్‌కు మరింత దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది అందుబాటులోకి రాబోతున్న అప్‌డేటెడ్ బ్లుటూత్ వర్షన్ కు సంబంధించిన 5 ముఖ్యమైన ఫీచర్లను క్రింది స్లైడర్‍‌‌లో చూడొచ్చు...

Read More : ఓపెన్ సేల్ పై Redmi Note 3

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విప్లవాత్మక ఫీచర్లతో ‘Bluetooth’ కొత్త వర్షన్

2016లో రాబోతోన్న బ్లూటూత్ స్మార్ట్ ప్రధానంగా ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'ను ఉద్దేశించి డిజైన్ చేయటం జరుగుతోంది. ఆధునిక టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లతో రాబోతున్న ‘బ్లూటూత్ స్మార్ట్'.. స్మార్ట్‌హోమ్, స్మార్ట్ ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, లోకేషన్ ఆధారిత యాప్స్‌తో పాటు సర్వీసులకు మరింత ఊతమివ్వనుంది.

విప్లవాత్మక ఫీచర్లతో ‘Bluetooth’ కొత్త వర్షన్

వెల్లడించిన వివరాల మేరకు అప్‌డేటెడ్ వర్షన్ బ్లూటూత్ ప్రస్తుతమున్న బ్లూటూత్ రేంజ్ (330 అడుగుల)తో పోలిస్తే నాలుగు రెట్ల హైరేంజ్ ఫ్రీక్వెన్సీని సపోర్ట్ చేస్తుంది.

విప్లవాత్మక ఫీచర్లతో ‘Bluetooth’ కొత్త వర్షన్

బ్లూటూత్ అసాధారణ వేగంతో స్పందిస్తుంది. క్రిటికల్ పరిస్థితిల్లోనూ వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌కు దోహదపడుతుంది.

విప్లవాత్మక ఫీచర్లతో ‘Bluetooth’ కొత్త వర్షన్

న్యూ బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయటం ఓ కీలక అంశం. ఒకే నెట్‌వర్క్‌లో ఉన్న వైర్‌లెస్ డివైస్‌లు లిమిటెడ్ రేంజ్‌లో ఒకదానితో మరొకటి అనుసంధానమవటాన్నే మెష్ నెట్‌వర్క్ అంటారు.

విప్లవాత్మక ఫీచర్లతో ‘Bluetooth’ కొత్త వర్షన్

కొత్త వర్షన్ బ్లుటూత్ శక్తివంతమైన డెవలపర్స్ సపోర్ట్‌ను కలిగి ఉండటం ఓ మంచి పరిణామం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting Facts About Next Bluetooth Version. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot