Home
News

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ కంపెనీని 1938లో లీ బయంగ్ చుల్ ప్రారంభించారు. సు-డాంగ్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ కంపెనీలో 40 మంది ఉద్యోగులు ఉండేవారు. ఈ కంపెనీ న్యూడిల్స్‌తో పాటు పచారీ సామన్లను మార్కెట్లో అందించేది. సామ్‌సంగ్ గ్రూప్ 1960లో ఎలక్ట్రానిక్స్ విభాగంలోని అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సామ్‌సంగ్ గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగువేసిన సామ్‌సంగ్ చెయిల్ పరిశ్రమలను ప్రారంభించి దేశీయంగా వివిధ ఉత్పత్తులను ప్రజలకు అందించింది. 1963లో జుల్‌డాంగ్ బ్యాంగ్‌లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసిన సామ్‌సంగ్ 1989లో ఆ కంపెనీ పేరును సామ్‌సంగ్ లైఫ్‌ఇన్స్యూరెన్స్‌గా మార్చింది. 1965లో పేపర్ పరిశ్రమలోకి సామ్‌సంగ్ అడుగుపెట్టంది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

1968, డిసెంబర్ 30.. చైర్మన్ బయుంగ్ - చుల్ లీ నేతృత్వంలోని సామ్‌సంగ్ బృందం సామసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1969, జనవరి 13వ తేదిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించారు. 1970, నవంబర్ నెలలో 12అంగుళాల బ్లాక్‌ అండ్ వైట్ టీవీని సామ్‌సంగ్ ఉత్పత్తి చేయగలిగింది. రెండు నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

వ్యాపారాభివృద్థిలో భాగంగా సామ్‌సంగ్ అదే సంవత్సరం (1970) పెట్రో కెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా మైక్రోవేవో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను పరిచయం చేసింది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

1980లో సెమీ కండెక్టర్‌ల తయారీ పై దృష్టిసారించిన సామ్‌సంగ్ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీలతో పాటు పర్సనల్ కంప్యూటర్‌లు, వీ.సీ.ఆర్‌లు, టేప్ రికార్డర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

వ్యాపారన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో సామ్‌సంగ్ 1990 మధ్య మెమెరీ కార్డులతో పాటు హార్డ్‌డిస్క్‌లను తయారు చేయడం ప్రారంభించింది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

1995లో సామ్‌సంగ్ తయారీ చేసిన తొలి మొబైల్ ఫోన్ అనుకున్న స్థాయలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుస్-హీ లీ పనికిరాని వేలాది ఫోన్‌లను ధ్వంసం చేయించారు.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

మొబైల్ ఫోన్‌ల తయారీని సీరియస్‌గా తీసుకన్న సామ్ సంగ్ 1999లో ఇంటర్నెట్‌కు అనువైన ఫోన్‌లను తయారు చేసింది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

ఓ వైపు మొబైల్ ఫోన్ మరోవైపు టెలివిజన్‌ల తయారీ పై దృష్టిపెట్టిన సామ్‌సంగ్ 1998లో తన మొదటి డిజిటల్ టీవీని తయారు చేసింది. 1999లో వీటి ఉత్పత్తి ప్రారభమైంది.

 సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

2000వ సంవత్సరం హైడెఫినిషన్ టీవీని సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చింది.

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు ‘గెలాక్సీ ఎస్'.

Best Mobiles in India

English summary
Interesting Facts About Samsung. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X