Xiaomi చైనా గురించి షాకింగ్ నిజాలు..?

|

కన్స్యూమర్ ఎలక్ట్ర్రానిక్స్ ప్రపంచంలోకి రివ్వున దూసుకొచ్చిన ప్రముఖ చైనా కంపెనీ షియోమీ (Xiaomi) ప్రముఖ బ్రాండ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తోంది.'యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీని ప్రముఖ పారిశ్రామికవేత్త లీ జన్ (Lei Jun) ఏప్రిల్ 6, 2010న ప్రారంభించారు. చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న షియోమీ సంస్థకు చైర్మన్ ఇకా సీఈఓగా ఈయనే వ్యవహరిస్తున్నారు. Xiaomi గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బుద్థిస్ట్ కాన్సెప్ట్ ప్రకారం

బుద్థిస్ట్ కాన్సెప్ట్ ప్రకారం

బుద్థిస్ట్ కాన్సెప్ట్ ప్రకారం షియోమీ అంటే మిల్లెట్ అండ్ రైస్ అని అర్థం. చైనా భాషలో షియోమి ఇంటే 'చిన్న రైస్' ( little rice) అని అర్థం.

యాపిల్ ఆఫ్ చైనా

యాపిల్ ఆఫ్ చైనా

షియోమీ సంస్థను యాపిల్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సంస్థ వ్యవస్థాపకులైన లీ జన్ ను ‘స్టీవ్‌‌జాబ్ప్ ఆఫ్ చైనా'గా పిలుస్తారు.

ఫిజికల్స్ స్టోర్స్ లేవు

ఫిజికల్స్ స్టోర్స్ లేవు

షియోమీ సంస్థకు చైనాలో తప్ప మరెక్కడా ఫిజికల్స్ స్టోర్స్ లేవు. అన్ని చోట్ల ఆన్‌లైన్ మాద్యమం ద్వారానే తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

9 లీడర్ షిప్ స్థానాల్లో

9 లీడర్ షిప్ స్థానాల్లో

షియోమీ కంపెనీలో మొదటి 9 లీడర్ షిప్ స్థానాల్లోని మూడు స్థానాలను మాజీ గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు. వారి వివరాలు లిన్ బిన్ (సహ వ్యవస్థాపకులు ఇంకా అధ్యక్షుడు), హాంగ్ ఫింగ్ (సహ వ్యవస్థాపకులు ఇంకా ఉపాధ్యక్షుడు), హ్యూగో బర్రా, వైస్ ప్రెసిడెంట్.

అత్యుత్తమ ఫ్రంట్ కెమెరా...

అత్యుత్తమ ఫ్రంట్ కెమెరా...

షియోమీ స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేసే ఫ్రంట్ కెమెరాలు మనుషులు వయస్సును కూడా గుర్తించగలవు. పిక్షర్ క్వాలిటీని పెంచుకునేందుకు సరైన ఫిల్టర్ ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

షియోమీ విజయానికి గల మూల కారణం

షియోమీ విజయానికి గల మూల కారణం

షీయోమీ ఆఫర్ చేసే ఫోన్‌లు బెస్ట్ క్వాలిటీతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉంటాయి. 

లిమిటెడ్ స్టాక్ మాత్రమే

లిమిటెడ్ స్టాక్ మాత్రమే

షియోమీ సంస్థ ఎప్పటికప్పుడు వారానికి సరిపడా లిమిటెడ్ క్వాంటిటీ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే మార్కెట్లోకి తీసుకువస్తుంది. 

 వ్యాపార సామ్రజ్యాన్ని మరంతగా విస్తరించుకునేందుకు

వ్యాపార సామ్రజ్యాన్ని మరంతగా విస్తరించుకునేందుకు

షియోమీ తన వ్యాపార సామ్రజ్యాన్ని మరంతగా విస్తరించుకునే క్రమంలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌బ్యాండ్స్ అలానే ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరకణాలను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు అవసరమయ్యే ఉత్పత్తులను షియోమీ భవిష్యత్‌లో లాంచ్ చేయబోతోంది.

లాభాల బాటలో

లాభాల బాటలో

షియోమి ఫోన్ లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవటంతో కంపెనీ లాభాల బాటలో నడుస్తోంది. 2013లో షియోమి అమ్మకాలు 4.3బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాటిలో అర్జించిన లాభం 56 మిలియన్ డాలర్లు. 2014లో షియోమి టెక్నాలజీ అమ్మకాలు 11.97 బిలియన్ డాలర్లుగా ఉంది. 

ధికారిక మాస్కట్

ధికారిక మాస్కట్

షియోమి అధికారిక మాస్కట్ బన్నీ ఇదే. పేరు మిటు (Mitu)

Best Mobiles in India

English summary
Interesting Facts About the Apple of China Xiaomi. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X