5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

Written By:
    X

    4జీ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ వంటి ప్రముఖ టెలికామ్ ఆపరేటర్స్ 4జీ ఇంటర్నెట్‌ను దేశంలో ఆఫర్ చేస్తున్నాయి.

     5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    టెక్నాలజీ పరంగా మనకంటే ముందంజలో ఉన్న జపాన్, అమెరికా వంటి దేశాలు 4జీ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిందంటూ 5జీ నెట్‌వర్క్ పై ముమ్మర పరిశోధనలు మొదలుపెట్టేసాయి. 5జీ నెట్‌వర్క్ రూపకల్పన ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నప్పటికి ఏదో ఒక రోజున కమర్షియల్‌గా అందుబాటులోకి రావటం తద్యం. 5జీ ఇంటర్నెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

    Read More : ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ, మునుపెన్నడు ఆస్వాదించని సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను చేరువ చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 5జీ ఎంత స్పీడ్‌లో లభ్యమవుతుంది..?, ఎంత డేటాను ఖర్చు చేస్తుంది..? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టమైన జవాబులు లేవు.

     

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు 5జీ నెట్‌వర్క్ దోహదం కానుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై 5జీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది.

     

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    త్వరలో రాబోయే 5జీ నెట్‌వర్క్ 3జీ, 4జీలతో పోలిస్తే ఖరీదైన నెట్‌వర్క్‌‌గా అవతరించనుంది.

     

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం అంత సలువైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఖరీదైన టెక్నాలజీకి సంబంధించి పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు లక్షల కోట్ల పెట్టుబడలతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడిన పాలసీలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

     

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    రానున్న ఐదు సంవత్సరాల్లో 5జీ టెక్నాలజీ పై కృషి చేసేందుకు దిగ్గజ టెలికామ్ ఆపరేటర్స్ అయిన చైనా మొబైల్, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, సాఫ్ట్ బ్యాంక్‌లు సంయుక్తంగా GTI 2.0 పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసాయి.

     

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    5జీ నెట్‌వర్క్ గురించి ఇప్పటికి వరకు ఏ విధమైన అధికారిక డెఫినిషన్ వెలుగులోకి రాలేదు. అయితే, 5జీ అనేది 4జీ నెట్‌వర్క్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా వస్తోన్న వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అని ధృడంగా చెప్పొచ్చు.

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో 4జీ ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఇవల్యూషన్) అనేది బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్. ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 100 Mbit/sగాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 4జీ టెక్నాలజీలో ఎల్టీఈ-ఏ అనేది అడ్వాన్సుడ్ వర్షన్‌గా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 500 Mbit/s గాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 2020లో రాబోతోన్న 5జీ టెక్నాలజీ డేటా స్పీడ్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలు వెల్లడికాలేదు.

     

    5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావీ 2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. మరో సంస్థ ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌, టోక్యోలోని రొపోంగి హిల్స్‌ కాంప్లెక్సుల్లో తాము 2015 అక్టోబర్‌ 13న అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్‌ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకుందని చెబుతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Interesting facts to know about 5G internet!. Read More in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more