టెక్నాలజీ గురించి అరుదైన నిజాలు!

తొలినాళ్లలో ఇంటర్నెట్‌ను శాస్త్రవేత్తలు మాత్రమే ఉపయోగించుకునేవారు. వీరు దీని ద్వారా ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం, ఇమేజ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొనేవారు. 1990లలో ఇంటర్నెట్‌ని వినియోగించుకోవాలంటే చాలా శ్రమపడాల్సి వచ్చేది. ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ను సులభతరం చేసిన సామన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే..? ఎఫ్‌టిపి, యూజ్‌నెట్‌, టెలినెట్‌, గోపెయిర్‌ లాంటి వివిధ ప్రోటోకాల్స్‌ సమ్మేళణంతో కూడిన ఇంటర్నెట్‌ సంబంధిత అప్లికేషన్ అవసరమవుతుంది.

టెక్నాలజీ గురించి అరుదైన నిజాలు!

Read More : ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవటం ఎలా..?

ఈ అంశం పై దృష్టిసారించిన అమెరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్స్‌ (ఎన్‌సిఎస్‌ఎ) ఉద్యోగులైన మార్క్‌ అండ్రీసిన్‌, ఎరిక్‌ బీనాలు 1992 డిసెంబర్‌లో ఆరు వారాల పాటు కష్టపడి ఓ ప్రోగ్రామ్‌ ను డిజైన్ చేసారు. దానికి మోజైక్‌ అని పేరు పెట్టారు. 1993 జనవరిలో అధికారికంగా ఈ యాప్ విడుదలయ్యింది. మోజైక్‌ విడుదలతో ఇంటర్నెట్‌ యాక్సెస్‌లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.

టెక్నాలజీ గురించి అరుదైన నిజాలు!

Read More : ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్ సురక్షితంగా ఉండాలంటే..?

గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (జియుఐ)తో రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మౌస్‌ని వినియోగించి పాయింట్‌ - అండ్‌ - క్లిక్‌ అనే పద్ధతితో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ మీద పెద్దగా అవగాహన లేనివారు సైతం ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేయడం ఎంతో సులభతరమైంది. మోజైక్‌ విండోలని ఫార్వర్డ్‌, బ్యాక్‌ బటన్స్‌ ద్వారా ఇంటర్నెట్‌లో ఒక పేజీ నుండి మరో పేజీకి ముందుకు, వెనుకకు వెళ్లడం, అనేక కొత్త అంశాలు దీనిలో రూపొందించడటంతో మోజైక్‌ తొలి ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ అప్లికేషన్‌గా ఆవిర్భవించింది. ఇంటర్నెట్ అలానే టెక్నాలజీ విభాగంలో ఆనాటి నుంచి ఇనాటి వరకు చోటుచేసుకున్న పలు ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు తెలుసా..?

32 సంవత్సరాల క్రితం 20ఎంబి సామర్థ్యం గల హార్డ్‌డ్రైవ్ బరువు 20 పౌండ్లు ఉండేది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెమరీ కార్డ్‌లు గ్రాముల బరువుతో జీబీల కొద్ది డేటాను స్టోర్ చేయగలగుతున్నాయి.

మీకు తెలుసా...?

యూట్యూబ్‌లో నిమిషానికి 100 గంటల వీడియో అప్‌లోడ్ అవుతోందట.

మీకు తెలుసా...?

2005లో ఏర్పాటు చేసిన హై-స్పెక్ కంప్యూటర్‌తో పోటీపడి ఇప్పటి వరకు ఏ మానవుడు చెస్ టోర్నమెంట్‌ను గెలవలేకపోయాడు.

మీకు తెలుసా...?

అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మరింత నాణ్యమైన టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో మన విశ్వానికి సంబంధించిన దృశ్యాలను మునుపటితో పోలిస్తే మరింత అర్థవంతంగా చూడగలుగుతున్నాం.

మీకు తెలుసా...?

1990లో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య 10 లక్షలంటే. ఇప్పుడా సంఖ్య 500 నుంచి 600 కోట్ల మధ్య ఉందట.

మీకు తెలుసా...?

ఇంటర్నెట్‌లో 1.2 జిట్టా బెట్స్ (1.3ట్రిలియన్ గిగాబైట్స్) డేటా ఉందట.ఈ డేటాను లోడ్ చేయాలంటే 75 బిలియన్ 16జీబి ఐప్యాడ్ యూనిట్లు అవసరమవుతాయట.

మీకు తెలుసా...?

2014లో ప్రపంచవ్యాప్తంగా 880 బిలియన్‌ల ఫోటోలు చిత్రీకరించబడ్డాయట. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరు సగటున 123 ఫోటోలు చిత్రీకరించకున్నట్లు అర్థం.

మీకు తెలుసా...?

టెక్నాలజీ కారణంగా వైద్య రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మహమ్మారి పోలియోను 99శాతం నివారించగలిగాం.

మీకు తెలుసా...?

1961 నుంచి ప్రపంచ ఆహార ఉత్పత్తి 25 శాతం పెరిగింది.

మీకు తెలుసా...?

1940లో ప్రతి లక్ష మందిలో 300 మంది యుద్ధం కారణంగా మరణించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. శాంతి స్థాపన కోసం మెరుగైన కమ్యూనినకేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రపంచదేశాలు ఆరాటపడుతున్నాయి.

మీకు తెలుసా...?

వైద్య రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు మనుషుల ఆయుర్థాయాన్నిపెంచగలుగుతున్నాయి.

మీకు తెలుసా...?

2001లో ప్రారంభమైన వికిపీడియా ప్రపంచ సమాచారాన్ని మనకందిస్తోంది.

మీకు తెలుసా...?

టెక్నాలజీ సహాయంతో చంద్రుడి పై కాలుమోపి అక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనిషి తహతహలాడుతున్నాడు.

మీకు తెలుసా...?

పూర్తిస్థాయి కమ్యూనికేషన్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆధునిక మనుషులకు అవసరమైన నిత్యావసర వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్ ఒకటి.

మీకు తెలుసా...?

ఆధునిక టెక్నాలజీ కారణంగా వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు 1991 నుంచి 2010 వరకు క్యాన్సర్ మరణాలను 20శాతం వరకు తగ్గించగలిగాయి.

మీకు తెలుసా...?

ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ స్పూర్తితో, ప్రపంచవ్యాప్తంగా 58శాతం జనాభా తమ భవిష్యత్ గరించి ఆలోచించటం ప్రారంభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting and rarely known Internet and Technology facts. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot