మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

Posted By:

అంతా ఊహించినట్లుగానే ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులయ్యారు. దీంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ నూతన సీఈఓ ఎంపిక పై గొతకొన్ని నెలలుగా కొనసాగుతన్న తర్జనభర్జనకు తెరపడినట్లయింది. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల వివిధ విభాగాల్లో పనిచేసారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి 39 సంవత్సరాల చరిత్ర ఉంది. కంపెనీ మొదటి సీఈఓగా బిల్ గేట్స్ వ్యవహిరించారు. రెండువ సీఈఓగా స్టీవ్ బాల్మర్ విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించనున్నారు.

బిల్ గేట్స్ కొత్త పాత్రలో:

మైక్రోసాఫ్ట్ కంపెనీలో బిల్ గేట్స్ కొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటి వరకు కంపెనీ ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన సాంకేతిక సలహాదారుగా పనిచేయనున్నారు. అలాను బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న జాన్ థాంప్సన్ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. సత్యనాదెళ్ల గురించి పలు ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

సత్య నాదెళ్ల 1967లో హైదరాబాద్‌లో జన్మించారు. హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి.

మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన సత్య నాదెళ్ల ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 46 సంవత్సరాల సత్య నాదెళ్ల స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం గ్రామం.

మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్ విండస్ డెవలప్‌మెంట్ విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేసారు. 1999లో మైక్రోసాఫ్ట్ బీసెంట్రల్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా, 2001లో మైక్రోసాఫ్ట్ బిజెనెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2007లో ఆన్‌లైన్ సేవల విభాగానికి సీనియర్ ఉప్యాధ్యక్షుడిగా, 2011లో మైక్రోసాఫ్ట్ సర్వర్ అండ్ టూల్స్ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు.

సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

సత్య నాదెళ్లకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడటమే నాకు అన్నీ నేర్పిందని చెబుతుంటారు సత్య. పాఠశాల జట్టులో అతను ఆడుతూ వచ్చాడు. జట్టుతో కలిసి పనిచేయడం క్రికెట్ ఆడడం వల్ల నేర్చుకున్నానని, జీవితమంతా తనకు నాయకత్వం ఉందని సత్య నాదెల్ల అన్నారు.

సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీకి 3వ సీఈఓగా నియమితులయ్యారు.

సీఈఓ సత్య నాదెళ్ల: ఆసక్తికర అంశాలు

సత్య నాదెళ్ల తన హైస్కూల్ ప్రియురాలు అనుపమను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot