చంద్రయాన్ -3 అప్‌డేట్... భారత ప్రతిపాదనకు పచ్చజెండా ఊపిన అంతర్జాతీయ ఖగోళ సంఘం..!
చంద్రయాన్-3 ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో (ISRO) సత్తా చాటింది. యావత్ ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేసింది. అప్పటి వరకు ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23, 2023 న చంద్రయాన్-3 ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జూలై 14న నింగిలోకి వెళ్లిన చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది.

దీంతోపాటు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన రష్యా, అమెరికా, చైనాల తర్వాత భారత్ చోటు సంపాందించింది. విక్రమ్ ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితరంపై సుమారు రెండు వారాలపాటు వివిధ పరిశోధనలు చేసింది. మొత్తంగా ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఇస్రో గతంలో వెల్లడించింది.
చంద్రుడి ఉపరితలంపై వివిధ రకాల పరిశోధనలు చేసింది. సల్ఫర్, ఆక్సిజన్ సహా ఇతర మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ (Chandrayaan 3) గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. దాంతోపాటు చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో మార్పులును కూడా గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది.
చంద్రయాన్-3 విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 26, 2023 బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆ కార్యక్రమంలోనే మోడీ కీలక ప్రకటన చేశారు.
చంద్రుడి దక్షిణ ధ్రువం పైన చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ప్రాంతాన్ని శివ శక్తి (Shiv Shakti) గా పేరు పెడుతున్నట్లు మోడీ వెల్లడించారు. దీంతోపాటు చంద్రయాన్-3 విజయవంతం అయిన ఆగస్టు 23 న జాతీయ అంతరిక్ష దినోత్సవం గా ప్రకటన చేశారు.
అయితే ఈ ప్రకటన వెలువడిన సుమారు 7 నెలల తర్వాత అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (IAU) శివ శక్తి పేరును ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 19న భారత ప్రతిపాదనకు IAU ఆమోదం లభించింది. గ్రహశకలాలకు కూడా ఈ అంతర్జాతీయ ఖగోళ సంఘం పేర్లు పెడుతుంది. గ్రహశకలాలు గుర్తించిన నెల సహా ఇతర వివరాలు ఆధారంగా పేర్లు పెడుతుంది.*
** భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల (మార్చి 22, 2024) న కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV LEX-02) అటానసమ్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతం పూర్తి చేసింది. ఈ RLV కు ఇస్రో పుష్పక్ గా పేరుపెట్టింది. గత సంవత్సరం RLV LEX-01 టెస్టింగ్‌ను ఇస్రో పూర్తిచేసింది.
తాజాగా అటానమస్ సామర్థ్యం కలిగిన RLV LEX-02ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చినూక్ హెలికాప్టర్.. 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది. అక్కడ నుంచి అటానమస్ సామర్థ్యం కలిగిన RLV LEX-02 విజయవంతంగా ల్యాండింగ్ అయింది. బ్రేక్ పారాచూట్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్, ల్యాండింగ్ గేర్ బ్రేక్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో ల్యాండ్ అయింది.


Click it and Unblock the Notifications








