అంతర్జాతీయ మహిళా దినోత్సవం: Google ప్రత్యేక డూడుల్‌, వాట్సాప్‌లో ప్రత్యేక స్టిక్కర్‌లను ఎలా పంపాలి

|

నేడు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే గూగుల్ సంస్థ ప్రత్యేక డూడుల్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా మహిళల పట్ల గల ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక విభాగాలలో విజయాలను సాధించిన మహిళల పట్ల గౌరవం, అభిమానం మరియు ప్రేమను ప్రదర్శించడానికి జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కొన్ని ఇతర ఇతివృత్తాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం గూగుల్ హోమ్‌పేజీలో విభిన్న సంస్కృతులకు చెందిన మహిళల జీవితాల సంగ్రహావలోకనాలను చూపే యానిమేటెడ్ స్లైడ్‌షోతో ఆకర్షణీయమైన డూడుల్ కనిపిస్తుంది.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: గూగుల్ డూడుల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: గూగుల్ డూడుల్

నేటి యుగంలో మహిళలు తల్లి స్థానం నుండి మోటర్ మెకానిక్ వరకు అనేక విభాగాలలో పని చేసే బాధ్యతను పోషిస్తున్నారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇంటి నుండి అంతరిక్షం వరకు మహిళలు ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని గూగుల్ సంస్థ నేటి డూడుల్ లో ఆసక్తికరంగా చూపించింది. మహిళలు ప్రతి రంగంలో సవాళ్లను మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ వారు వాటిని ఎదుర్కొంటూ మరింత దృఢంగా స్థిరపడతారు.

వాట్సాప్‌లోకి కొత్తగా టెలిగ్రామ్‌ యొక్క మరొక ఫీచర్ అందుబాటులోకి రానున్నది!! ఏమిటో తెలుసావాట్సాప్‌లోకి కొత్తగా టెలిగ్రామ్‌ యొక్క మరొక ఫీచర్ అందుబాటులోకి రానున్నది!! ఏమిటో తెలుసా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం
 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 1908న మొదటిసారి ప్రారంభించబడింది. అయితే దీనిని జరుపుకునే చొరవ ఒక సంవత్సరం తర్వాత కార్మిక ఉద్యమం నుండి వచ్చింది. ఆ తర్వాత మాత్రమే ఐక్యరాజ్యసమితి దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పేర్కొంది. 1911లో మొదటిసారిగా డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మరియు జర్మనీలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే దీనిని అధికారికంగా 1975లో ఐక్యరాజ్యసమితి అమలు చేసింది.

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అందుబాటులో!! ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకోవడం ఎలా?ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అందుబాటులో!! ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకోవడం ఎలా?

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021 సంవత్సరాల్లో 29 మంది అత్యుత్తమ మహిళలకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేయనున్నారు. వారం రోజుల కార్యక్రమం నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

వాట్సాప్ ఉపయోగించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్టిక్కర్‌లను పంపే విధానం

వాట్సాప్ ఉపయోగించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్టిక్కర్‌లను పంపే విధానం

స్టెప్ 1: ముందుగా మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: ఆ తర్వాత చాట్‌బాక్స్‌ని ఓపెన్ చేసి కిందికి వస్తున్న టైపింగ్ బార్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు కీబోర్డ్‌పై వచ్చే స్టిక్కర్ల ఎంపికకు వెళ్లండి. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి "ఉమెన్స్ డే స్టిక్కర్స్" కోసం సెర్చ్ చేయండి.

స్టెప్ 4: మీరు దీన్ని టైప్ చేసిన వెంటనే చాలా స్టిక్కర్లు మీ ముందు కనిపిస్తాయి. మీరు పంపాలనుకుంటున్న స్టిక్కర్‌పై క్లిక్ చేసి సెండ్ బటన్ నొక్కండి.

 

Best Mobiles in India

English summary
International Women’s Day: Google celebrates special Doodle, How to send special Stickers in whatsapp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X