Home
News

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళలూ సోషల్‌ మీడియాలో ఈ జాగ్రత్తలు పాటించండి..!

ప్రపంచమంతా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's day 2024) ఘనంగా నిర్వహించుకుంటోంది. మహిళల విజయాలు మరియు వారి సాధికారత గురించి యావత్‌ ప్రపంచం నేడు గుర్తిస్తోంది. అయితే ప్రస్తుతం మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వేధింపులు, ఆన్‌లైన్‌ భద్రత ప్రధానమైనవి, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం మహిళల భద్రత ప్రధాన సమస్యగా ఉంది.

అయితే ఈ ప్లాట్‌ఫాంల వల్ల అనేక ప్రయోజనాలున్నప్పటికీ.. ప్రధానంగా వ్యక్తిగత భద్రత ఆందోళన (Women Safety Feature) కలిగిస్తోంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నప్పుడు అనేక భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళామణులు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సి కొన్ని జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.

International Women s day privacy steps news

ప్రైవసీ సెట్టింగులను మార్చుకోవాలి : సోషల్‌ మీడియా వేదికల్లో ఉన్న మహిళలు తమ ప్రొఫైల్‌ (Profile Privacy Settings) సహా ఇతర స్టోరీలను సన్నిహితులకు పరిమితం చేయవచ్చు. వ్యక్తిగత చర్చల సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. దీంతోపాటు ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌, పనిచేసే ప్రాంతం వంటి వివరాలు షేర్‌ చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

ఈ ఫీచర్లను వినియోగించుకోవచ్చు : వాట్సాప్‌ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసినప్పుడు ఆ మెసేజింగ్‌ యాప్‌ అందించే భద్రతా ఫీచర్లను వినియోగించుకోవచ్చు. డిస్సెపియరింగ్ మెసేజ్‌ (Disappearing Messages) వంటి ప్రైవసీ ఫీచర్లను వినియోగించుకోవాలి. దాంతోపాటు ఫోటోలు, వీడియోలను పంపినప్పుడు View Only Once అనే ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

అనుమానిత లింక్‌లను క్లిక్‌ చేయవద్దు : అనుమానిత లింక్‌లు మరియు అటాచ్‌మెంట్లను క్లిక్‌ చేయవద్ధు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగత సమాచారం తెలుసుకోనే ప్రయత్నం చేసిన సున్నితంగా తిరస్కరించండి. ఎప్పటికప్పుడు అలాగే సోషల్‌ మీడియా సంస్థలు అందిస్తున్న సెక్యురిటీ అప్‌డేట్లను వినియోగించుకోండి.

అసౌకర్యం కలిగినా.. అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. : సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఎవరి ప్రవర్తన అయిన మీకు అసౌకర్యం కలిగించినా లేదా ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవర్తించినా వారిని బ్లాక్‌ లేదా రిపోర్టు చేసేందుకు వెనుకాడవద్దు. దీంతోపాటు ఆన్‌లైన్‌ వేదికగా జరిగే అనవసర చర్చల్లో పాల్గొనడం ఇష్టం లేకుంటే ఆయా గ్రూప్‌లు, ఛానళ్లను మ్యూట్‌ లేదా అన్‌ఫాలో చేయవచ్చు.

వాట్సాప్‌ 'టూ స్టెప్‌ వెరిఫికేషన్‌' : యూజర్లకు మరింత మెరుగైన భద్రతను కల్పించేందుకు వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చిన 'Two Step Verification" ఫీచ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఇందుకోసం 6 అంకెల పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌కు మరింత భద్రతను ఇస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
International Women's day here are the privacy steps while using social media for women
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X