ఆన్లైన్ లోనే యోగా డే 2020! బెస్ట్ వీడియో కాలింగ్ అప్ లు ఇవే !
ప్రపంచం మొత్తం జూన్ 21 యోగా దినోత్సవం జరుపుకుంటుందని మనందరికీ తెలుసు. కానీ చాలా మంది ఈ సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవం 2020 (international yoga day 2020 )ని ఎలా జరుపు కోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ కరోనా వైరస్ కారణం గా మునుపటి లాగా అందరితో కలిసి యోగా డే లో పాల్గానే అవకాశం లేదని చాలామంది నిరుత్సాహ పడుతుంటారు కూడా. అలాంటి వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు , ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరితో కలిసి మీరు యోగ డే లో పాల్గొనచ్చు.కానీ ఆన్లైన్ లో ...అదెలాగో మీరే చదవండి.

మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఈ వీడియో కాలింగ్ అప్ లు ఇంస్టాల్ చేసుకుంటే చాలు ,ఎప్పటి లాగే మీ సన్నిహితులతో కలిసి ఈ సంవత్సరం కూడా యోగా డే లో పాల్గొనవచ్చు. ఆ అప్ లు ఏంటో మీరూ ప్రయత్నించండి

వాట్సాప్
వాట్సాప్ గురించి తెలియని వాళ్ళు ఉండరు కానీ అందులోని అన్ని ఫీచర్లు వాడే వాళ్ళు కొందరే ఉంటారు.వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ తో 8 మంది తో ఒకేసారి వీడియో కాల్ లో మాట్లాడవచ్చు.ఇందులో టైం లిమిట్ అనేది ఉండదు అంతే కాక ఇది పూర్తిగా ఉచితం.

జూమ్
కరోనా వైరస్ లొక్డౌన్ సమయం నుండి బాగా వాడుకలోకి వచ్చిన అప్ లలో జూమ్ మొదటిది.ఈ అప్ లో 100 మంది నుంచి 500 మంది దాక ఒకేసారి వీడియో కాల్ లో మాట్లాడుకోవచ్చు.కానీ దీనికి ధర చెల్లించాల్సి ఉంటుంది.ఇంతకు ముందు 40 నిముషాలు కాల పరిమితి కూడా ఉండేది కానీ తరవాత దాన్ని తొలగించారు.

స్కైప్
చాలామంది కి ఇష్టమైన మరియు ఎక్కువ మంది వాడుతున్న వీడియో కాలింగ్ అప్ ఇది.ఇది పూర్తిగా ఉచితమే కాక వాడటం కూడా చాలా సులభం గా ఉంటుంది.స్కైప్ ద్వారా ఒకే సారి 50 మంది వరకూ వీడియో కాల్ లో పాల్గొనవచ్చు.మిగతా వాటితో పోలిస్తే వాడటానికి కూడా ఇది చాలా సులభం.

గూగుల్ డుయో
గూగుల్ డుయో కూడా ఇతర అప్ ల లాగే వీడియో కాలింగ్ కు బాగా పనిచేస్తుంది.మీ జిమెయిల్ అకౌంట్ తో సులభంగా లాగిన్ అవ్వచ్చు.ఇందులో ఒకేసారి 12 మంది వరకూ వీడియో కాల్ లో పాల్గొనే అవకాశం ఉంది.

Yoga Day 2020
వీడియో కాల్ సదుపాయం లేని వాళ్ళు నిరుత్సాహ పడకుండా మీకు తోచిన రీతిలో సామజిక దూరం పాటిస్తూ యోగా డే లో పాల్గొనవచ్చు.యోగా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా మానసిక ప్రశాంతహకుడా లభిస్తుంది.మీ అందరికి Happy International Yoga Day 2020.


Click it and Unblock the Notifications