తల్లిని కత్తితో పొడిచిన 11యేళ్ల గేమింగ్ పిచ్చోడు..

Posted By: Super

తల్లిని కత్తితో పొడిచిన 11యేళ్ల గేమింగ్ పిచ్చోడు..

 

సెంట్రల్ చైనా దేశంలో 'హుబెయ్'లో నివసిస్తున్న 11సంవత్సరాల వయసు కలిగిన 'డోంగ్ డాంగ్' అనే అబ్బాయికి వెబ్ గేమింగ్ అంటే పిచ్చి. తల్లిదండ్రులు తనకున్న ఈ వెబ్ గేమింగ్‌ పిచ్చిని  అడ్డుకున్నందుకు గాను తన తల్లిని కత్తితో పొడిచాడు. ఇక వివరాల్లోకి వెళితే 'డోంగ్ డాంగ్' తన ఇంటి వద్దనున్న 'బ్లాక్ ఇంటర్నెట్ బార్'లో ఆన్ లైన్ గేమ్స్‌ని ఆడడం మొదలుపెట్టాడు. సాధారణంగా చిన్నపిల్లలను ఇంటర్నెట్లో బార్స్‌లోకి ఎక్కువ సమయం గేమ్స్ ఆడేందుకు అనుమతించకపోయినప్పటికీ తనకున్న తెలివితేటలతో  'డోంగ్ డాంగ్' ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ ఉండేవాడు.

ఇంటర్నెట్ బార్‌కి వెళ్లేందుకు తనకి అవసరమైన డబ్బుని  వాళ్ల తల్లిదండ్రులు కూరగాయాలకు పంపినప్పుడు సమకూర్చుకోవడం లేదా.. తన తల్లి పర్సు నుండి దొంగిలించడం లాంటి పనులు చేసేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు భోజనం తర్వాత 'డోంగ్ డాంగ్' తన తల్లి పర్సు నుండి డబ్బు దొంగిలించి, రాత్రి వేళ ఇంటర్నెట్‌ బార్‌కి వెళ్లడం జరిగింది. ఈ సమయంలో 'డోంగ్ డాంగ్' తల్లి అతని రూమ్‌కి రాగా అతను కనిపించకపోవడంతో కంగారు పడి వెతకడం ప్రారంభించారు.

 

'డోంగ్ డాంగ్' ఇంటర్నెట్ బార్‌లో ఉన్నాడని తెలుసుకున్న అతని తల్లి అతనని ఇంటికి తీసుకోని వచ్చి, కర్రతో కొడుతుండగా.. అందుకు ఆవేశపరుడైన 'డోంగ్ డాంగ్' వంటగదిలో ఉన్న కత్తి తీసుకోని తన తల్లిని గాయపరిచాడు. సాధారణంగా చైనాలో పిల్లలు తప్పుదారిన పడుతుంటే వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు గాను కొట్టడం అనేది సాధారణ విషయం. అసలు 'డోంగ్ డాంగ్' ఇలా అవడానికి కారణం బ్లాక్ ఇంటర్నెట్ బార్స్‌ అంటూ.. పిల్లలను ఎక్కువ సేపు ఇంటర్నెట్ బార్‌లో ఆన్‌లైన్ గేమ్స్ అడుకునేందుకు పరిమిషన్ ఇచ్చిన బార్స్‌పై చైనా ప్రభుత్వం చర్య తీసుకోనుంది.

ఇది మాత్రమే కాకుండా గతంలో ఓ చైనా స్డూడెంట్ ఐప్యాడ్‌ని కొనేందుకు గాను.. తన కిడ్నీని అమ్ముకున్న సంఘటన చూశాం. దీనితో పాటు ఓ టీనేజీ అమ్మాయి ఐపోన్ 4ఎస్ కొనేందుకు డబ్బులు లేక తన వర్జీనిటీని కూడా ఆఫర్ చేసిన విషయం తెలిసిన విషయం తెలిసిందే. దీనిని బట్టి తెలిసింది ఏమిటంటే పిల్లలను తల్లి దండ్రులు ఎప్పడూ గమనిస్తూ ఉండాలన్నమాట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot