Internet Banking Frauds: వాట్సాప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా!!! జాగ్రత్త...

|

కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కమ్యూనికేషన్ కోసం ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత రోజులలో మనలో చాలా మంది మరొకరితో కమ్యూనికేషన్ చేయడం కోసం వాట్సాప్ ను అధికంగా వాడుతున్నారు.

 

వాట్సాప్

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యక్తిగత విషయాల నుండి కార్యాలయ చాట్‌ల వరకు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ అతి ముఖ్యమైన సాధనంగా వినియోగిస్తున్నారు. వాట్సాప్ ఇప్పటికే 2 బిలియన్ యూజర్ బేస్లను దాటింది. అలాగే ఇందులో ఒకరి సమాచారాన్ని దొంగలించడానికి హ్యాకర్లకు కూడా చాలా సులభంగా మారింది. వాట్సాప్‌లో చెలామణి అవుతున్న OTP కుంభకోణం గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది తన వినియోగదారులను హెచ్చరించింది.

సైబర్ క్రైమినల్స్

ఇదే కాకుండా సైబర్ క్రైమినల్స్ తరచుగా అమాయకపు వినియోగదారులను మోసగించడానికి ఈ వేదికను అధికంగా ఉపయోగిస్తారు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా సైబర్ నేరస్తుల నుండి మమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసానికి గురికాకుండా ఉండడానికి మీరు వాట్సాప్‌లో చేయకూడని విషయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్‌లో  చేయకూడని ముఖ్యమైన విషయాలు
 

వాట్సాప్‌లో చేయకూడని ముఖ్యమైన విషయాలు

*** మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు డెబిట్ / క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ వంటి ప్రైవేట్ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఎప్పుడూ మరొకరితో షేర్ చేసుకోవడం చాలా ప్రమాదం.

*** OTP నంబర్ షేర్ చేయమని అడుగుతు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లకు స్పందించకపోవడం అన్నిటికన్నా ఉత్తమం. అది ఎంత చిన్న మొత్తం అమౌంట్ అయినా సరే.

*** అపరిచితులు లేదా తెలియని వారు పంపిన మెసేజ్ ల నుండి ఏవైనా ఫైళ్ళను డౌన్‌లోడ్ చేయమని అడిగితే మాత్రం ఎటువంటి పరిస్థితులలోను వాటిని డౌన్‌లోడ్ చేయకండి. తెలియని నెంబర్ నుండి ఇటువంటి మెసేజ్ కనుక వస్తే వాటిని పట్టించుకోకపోవడం చాలా మంచిది.

 

స్మార్ట్‌ఫోన్‌

*** ఒక వేల మీరు మీ ఫోన్‌ను పారవేసుకొని ఉంటే కనుక మీ యొక్క వాట్సాప్‌ను వెంటనే డీయాక్టివేట్ చేయండి.

*** మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నప్పుడు మీ యొక్క అన్ని వాట్సాప్ మరియు ఇతర డేటాను పూర్తిగా తొలగించండి. అలాగే ఫోన్‌లో ఫ్యాక్టరీ సెట్టింగ్‌లను రిస్టోర్ చేయండి.

*** తెలియని వారి వాట్సాప్ నుండి వచ్చిన మెసేజ్ లకు ఎప్పుడూ స్పందించకండి. యాప్ ద్వారా ఎటువంటి కంపెనీ మిమ్మల్ని ఎప్పటికీ సంప్రదించదు. ఉచిత చందా లేదా ఇతర ప్రయోజనాలను అందించే ఎటువంటి మెసేజ్ వాట్సాప్ లో వస్తే కనుక అది ఖచ్చితంగా ఒక స్కామ్.

 

వాట్సాప్‌తో

*** వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్ లకు ఎప్పుడూ స్పందించకండి.

*** మీ PC ని వాట్సాప్‌తో కనెక్ట్ చేయగలరని మరియు డెస్క్‌టాప్ నుండి మెసేజ్ లను పంపగలరని చెప్పుకునే సందేశాలను నమ్మవద్దు.

*** వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌లను డిసేబుల్‌లో ఉంచండి. డౌన్‌లోడ్ అవుతున్నది మీకు తెలుసని ఇది నిర్ధారిస్తుంది.

*** ఓపెన్ మరియు పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయినప్పుడు వాట్సాప్ ను ఉపయోగించడం మానుకోండి.

 

Best Mobiles in India

English summary
Internet Banking Frauds: Things don't do on WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X