ఇంటర్నెట్‌కు 30 ఏళ్లు!

లండన్: కమ్యూనికేషన్ ప్రపంచాన్ని మరింత పటిష్టం చేసిన అంతర్జాలం (ఇంటర్నెట్) జనవరి 1, 2013తో 30 వసంతాలను పూర్తి చేసుకుంది. ఇంటర్నెట్‌ను 1983, జనవరి1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్’ నెట్‌వర్క్ ఈ మేరకు ఆ రోజు అధికారికంగా ప్రారంభమైంది.
కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్’ అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)’ రాకకు మార్గం సుగమం చేసింది. తొలుత మిలటరీ అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 1960లలో వేల్స్ శాస్త్రవేత్త డొనాల్డ్ డెవీస్ పలు నెట్‌వర్క్ డిజైన్లను రూపొందించారు. వీటి ఆధారంగానే తర్వాత ఆర్పానెట్‌కు రూపకల్పన జరిగింది.
కొత్త ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ కోసం పాత వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా లోపరహిత ‘ఆర్పానెట్’ వ్యవస్థకు రూపకల్పన ప్రక్రియ 1983, జనవరి 1న పూర్తయి ఇంటర్‌నెట్ ఆవిర్భవించింది. తర్వాత బ్రిటన్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ కృషితో 1989లో వరల్డ్ వైడ్ వెబ్ వినియోగం మొదలైంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications