గుడ్ న్యూస్...ఆన్‌లైన్ యాప్స్‌లో పెరిగిన జాబ్స్ డిమాండ్.

By Gizbot Bureau
|

కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ఫలితంగా ఆన్‌లైన్ సేవల పట్ల కస్టమర్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా COVID-19 బారిన పడకుండా జనం ఎక్కువగా ఆన్ లైన్ సేవలను వినియోగించుకున్నారు. దీంతో సదరు టెక్నాలజీ బేస్డ్ ఇంటర్నెట్ కంపెనీలు గణనీయమైన పెరుగుదల నమోదుచేశాయి. అంతేకాదు ఈ కంపెనీలు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పరిణితి సాధించాయి.

అమెజాన్ ఇండియా

అమెజాన్ ఇండియా

ఇప్పటికే ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగ, డ్, మంగళూరు, ఇండోర్, భోపాల్ మరియు లక్నోలలో కస్టమర్ సర్వీస్ విభాగంలో 20,000 సీజనల్ బేస్డ్ ఉద్యోగాలను ప్రకటించింది. అంతకుముందు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ (ఇ-కిరాణా విభాగం), పేటీఎం మాల్ (ఇ-కామర్స్), భారత్‌పే (ఫైనాన్షియల్ టెక్నాలజీ), లిషియస్ (ఆన్‌లైన్ మాంసం డెలివరీ), నోబ్రోకర్.కామ్ (ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్) ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ (లాజిస్టిక్స్) వంటి సంస్థలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఓ వైపు లాక్ డౌన్ వేళ ఉద్యోగాలు పోతుంటే ఇటు టెక్నాలజీ బేస్డ్ కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. 

కస్టమర్ సేవల అందించడానికి

కస్టమర్ సేవల అందించడానికి

ఇమెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ వంటి వివిధ మాధ్యమాల ద్వారా కస్టమర్ సేవల అందించడానికి కొత్త ఉద్యోగులు అవసరమని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు అర్హతగా 12 వ తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా నిర్ణయించారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు లేదా కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉండాలని కోరింది. ఇక పెరుగుతున్న కస్టమర్ డిమాండ్ కు అనుగుణంగా తాము వారి అవసరాలను నిరంతరం అంచనా వేస్తున్నాము. రాబోయే ఆరు నెలల్లో కస్టమర్ల రద్దీ పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్లు అమెజాన్ ఇండియా కస్టమర్ సర్వీస్ డైరెక్టర్ అక్షయ్ ప్రభు అన్నారు.

పేటీఎం మాల్

పేటీఎం మాల్

ఇటీవలే తన ప్రధాన కార్యాలయాన్ని నోయిడా నుండి బెంగళూరుకు తరలించిన ఆన్‌లైన్ రిటైలర్ పేటీఎం మాల్, తన వ్యాపార వర్గాలను విస్తరించే లక్ష్యంతో తన ప్రొడక్షన్, టెక్నాలజీ అవసరాల కోసం 300 మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరుకు ప్రధాన కార్యాలయాన్ని మార్చడం ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో లభించే రిచ్ టాలెంట్ పూల్‌ తమకు అక్కడ లభిస్తుందని భావిస్తున్నారు. 

ఆన్‌లైన్ రిటైల్ విభాగంలో

ఆన్‌లైన్ రిటైల్ విభాగంలో

ఆన్‌లైన్ రిటైల్ విభాగంలో ఇలాంటి వృద్ధిని ఊహించి, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, మింట్రా, పేటిఎం లాంటి ఇ-కామర్స్ కంపెనీలతో ఇప్పటికే భాగస్వామ్య సేవలు అందిస్తోంది. అయితే పని పెరుగుతున్న దృష్ట్యా సుమారు 7,000 మందిని రానున్న రెండు నెలలో తీసుకోవాలని నిర్ణయం తీసకుంది. వీరిని సప్లై, వేర్ హౌస్ నిర్వహణ, టెక్నాలజీ, డేటా సైన్స్ వంటి వ్యాపార విధుల్లో ఎక్కువ మందిని వినియోగించుకునే ప్రణాళికలను ప్రకటించింది. ఈ నియామకాలు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రోలతో పాటు అహ్మదాబాద్, సూరత్, చండీగడ్, ఇండోర్, పాట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్ పట్టణాల్లో కూడా తీసుకోనున్నారు. 

ఆన్‌లైన్ షాపింగ్

ఆన్‌లైన్ షాపింగ్

కోవిడ్ లాంటి ఈ క్లిష్ట సమయాల్లో, నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ కోసం డిమాండ్ పెరుగుదలను మేము చూస్తున్నాము. అయితే డిమాండ్ దృష్ట్యా కొత్త ఉద్యోగుల నియామకం ద్వారా ఇ-కామర్స్ పరిశ్రమ సప్లై చెయిన్ ఎలాంటి ఆటంకం రాకుండా దోహదపడుతుందని ఇ-కామర్స్ పరిశ్రమ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ దీప్ సింగ్లా అన్నారు.

బిగ్ బాస్కెట్ , గ్రోఫర్స్ వంటి ఇ-కిరాణా కంపెనీలు

బిగ్ బాస్కెట్ , గ్రోఫర్స్ వంటి ఇ-కిరాణా కంపెనీలు

మార్చి 25 న లాక్డౌన్ ప్రకటన తరువాత ఆన్ లైన్ మార్కెటింగ్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. ముఖ్యంగా బిగ్ బాస్కెట్ , గ్రోఫర్స్ వంటి ఇ-కిరాణా కంపెనీలు. డెలివరీ, గోడౌన్ ఫంక్షనింగ్ లో తమ సిబ్బంది బలాన్ని పెంచుకోవలసి వచ్చింది. బిగ్‌బాస్కెట్ గోడౌన్స్, పంపిణీ కేంద్రాలు, పంపిణీ సిబ్బందికి 10,000 మంది ఆన్-గ్రౌండ్ సిబ్బందిని చేర్చే ప్రణాళికలను సిద్ధం చేయగా, గ్రోఫర్లు 2 వేల మంది కార్మికులను నియమించుకునే ప్రక్రియ ప్రారంభించింది. 

జొమాటో

జొమాటో

అటు ఫిన్‌టెక్, ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ వంటి ఇతర విభాగాలలోని కంపెనీలు కూడా ప్రణాళికలను ప్రకటించాయి. ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే రెండు అగ్రశ్రేణి హైరింగ్‌లు చేసింది. జొమాటో నుండి నిశాంత్ జైన్‌ను చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నియమించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల 500 మంది సిబ్బందిని తీసుకున్నామని తెలిపింది. అంతేకాదు అదనంగా, భారత్‌పే మాజీ వాల్‌మార్ట్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ అంకుర్ జైన్‌ను దాని చీఫ్ ప్రాడక్టు ఆఫీసరుగా నియమించారు. అలాగే హెచ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ వేటలో ఉన్నారు.

నోబ్రోకర్.కామ్

నోబ్రోకర్.కామ్

అదనంగా, జనరల్ అట్లాంటిక్ నుండి అదనంగా 30 మిలియన్ డాలర్లను స్వీకరించిన ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ లిస్టింగ్ సంస్థ నోబ్రోకర్.కామ్ గత నెలలో 100 మందికి పైగా మార్కెటింగ్, టెక్నాలజీ సేవల కోసం ఉద్యోగులను నియమించుకుంది. అలాగే ఆన్‌లైన్ మాంసం డెలివరీ స్టార్టప్ లిషియస్ కూడా డిమాండ్ కు తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకుంది.  

Best Mobiles in India

English summary
Internet cos offer thousands of jobs to meet surging demand for online services

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X