Home
News

తెలుగులో డొమైన్ పేర్లు వస్తున్నాయ్ !

ఎవరిచేతిలోనైనా వెబ్‌సైట్ రూపుదిద్దుకోవాలంటే డొమైన్‌ అనేది చాలా కచ్చితంగా అవసరం అవుతుంది.

By Hazarath Aiah

ఎవరిచేతిలోనైనా వెబ్‌సైట్ రూపుదిద్దుకోవాలంటే డొమైన్‌ అనేది చాలా కచ్చితంగా అవసరం అవుతుంది. ఏ భాషకు సంబంధించి వారైనా సరే తమకు నచ్చిన డొమైన్‌ కావాలంటే దానిని ఇంగ్లీష్‌లో వెతుకోవాల్సిందే. అయితే ఇకపై తమ సొంత భాషల్లో డొమైన్లు వెతుక్కునే అవకాశం రాబోతోంది. ఇంగ్లీష్‌లో డొమైన్‌ వెతికే ప్రక్రియకు రాంరాం చెబుతూ మాతృభాషలోనే తమకు కావాల్సిన డొమైన్‌ను వెతుకునే సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిసింది. దీనికోసం 'ది ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్', 'ది నాన్‌ ప్రాఫిట్‌ కార్పొరేషన్‌', ఇంటర్నెట్ డొమైన్‌ నేమ్స్‌' సంస్థలు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడైంది.

22 షెడ్యూలు భాషలతో పాటు

22 షెడ్యూలు భాషలతో పాటు

భారత్‌లోని 22 షెడ్యూలు భాషలతో పాటు, వాడుకలో ఉన్నఅనేక భాషలలో డొమైన్లు తీసుకొచ్చే ఏర్పాట్లను ఆ సంస్థలు చేస్తున్నాయి.

ప్రస్తుతం పరిశీలన ..

ప్రస్తుతం పరిశీలన ..

ముఖ్యంగా తెలుగు, బెంగాలీ, దేవనాగరి, గుర్మకి, కన్నడ, మలయాళం, ఒరియా, తమిళ్‌ భాషలపై ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోందని ఐసీఏఎన్‌ఎన్‌ అధికారి సమ్రిన్‌ గుప్తా చెప్పారు. ఈ స్క్రిప్టులు పలు స్థానిక భాషలను కవర్‌ చేయనున్నట్టు తెలిపారు.

ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేని వారు

ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేని వారు

ప్రపంచంలో ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేని వారు సైతం వారి మాతృభాషలో వెతికి అక్కడి వెబ్‌సైట్లను, ఆన్‌లైన్‌ను సందర్శించవచ్చని తెలిపారు.

తెలుగు భాషకు సంబంధించిన ..

తెలుగు భాషకు సంబంధించిన ..

ఉదాహరణకు ఒక వ్యక్తి తన తెలుగు భాషకు సంబంధించిన వెబ్‌సైట్‌ పేరును తెలుగులో టైప్‌ చేస్తే ఆ వెబ్‌సైట్ వచ్చేవిధంగా ప్రస్తుత విధానం రూపుదిద్దుకుంటోంది. అంటే ఇక నుంచి దీని కోసం ఇంగ్లీష్‌ భాషనే వాడాల్సినవసరం లేదు.

52శాతం మందికే ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ..

52శాతం మందికే ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ..

ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 52శాతం మందే ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ఉండి ఇంటర్నెట్‌ బాగా ఉపయోగిస్తున్నారని గుప్తా చెప్పారు. మిగిలిన 48శాతం మంది అంటే ఎవరికైతే ఇంగ్లీష్‌పై అంతగా అవగాహన లేదో, వారికి తమ తమ భాషల్లో డొమైన్‌ పేర్లు అందుబాటులో ఉండనున్నాయి.

 మాతృభాషలో టైప్‌ చేసే మెళకువలు

మాతృభాషలో టైప్‌ చేసే మెళకువలు

ప్రజలు వారు మాతృభాషలో టైప్‌ చేసే మెళకువలు నేర్చుకుంటే చాలు ఈ ప్రయత్నం ఉపయోగకరంగా మారుతుందని గుప్తా తెలిపారు. ఇప్పటికే మాతృభాషల్లో టైప్‌ చేస్తే చాలు గూగుల్‌, ఇతర సెర్చింజన్లకు కావాల్సిన సమాచారం అందజేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
internet-domain-names-indian-languages-soon more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X