ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్9 విడుదల చేసిన 24గంటల్లో 2.3 మిలియన్ డౌన్‌లోడ్స్

Posted By: Super

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్9 విడుదల చేసిన 24గంటల్లో 2.3 మిలియన్ డౌన్‌లోడ్స్

శాన్ ప్రాన్సికో: కంప్యూటర్ ప్రపంచంలో రారాజు మైక్రోసాప్ట్ కొత్తగా విడుదల చేసినటువంటి పాపులర్ వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9కి సంబంధించినటువంటి వర్సన్ ఇంటర్నెట్‌లో విడుదల చేసిన ఒక్కరోజులోనే 2.3మిలియన్ సార్లు డౌన్ లోడ్ చేసుకోవడం జరిగింది. మార్చి 15వ తారీఖున సౌత్ వెస్ట్‌‍లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 వర్సన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోక విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించేటటువంటి Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌కి ప్రస్తుతం విడుదలైనటువంటి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 సపోర్టు చేయడం లేదు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 కేవలం విండోస్ విస్తా మరియు విండోస్7 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు మాత్రమే సపోర్టు చేస్తుంది.

ఈ సందర్బంలో మైక్రో సాఫ్ట బ్లాగులో దాని యాజమాన్యం ఈక్రింది విధంగా స్పందించారు. గతంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9కి సంబంధించిన బీటా వర్సన్‌ని ఒక్కరోజులో దాదాపు 2మిలియన్ యాజుర్స్ డౌన్ లోడ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9కి సంబంధించినటువంటి ఆఫీసియల్ బిల్డ్‌ని ఒక్కరోజులో 2.3 మిలియన్స్ యూజర్స్ డౌన్ లోడ్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 విషయానికి వస్తే ఇది HTML5 మరియు CSS3ని సపోర్టు చేస్తుందని అన్నారు.

ఇది ఇలా ఉంటే మార్కెట్‌లోకి మార్చి 22వ తారీఖున మొజిల్లా ఫైర్ ఫాక్స్ 4ని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా గూగుల్ కూడా తన లేటేస్ట్ క్రోమ్ 10ని మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot