ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్టు.. పట్టణాల కంటే గ్రామాల్లోనే అధికంగా ఇంటర్నెట్ యూజర్లు..!!
ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. భారత్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సుమారు 800 మిలియన్ల ప్రజలు ఇంటర్నెట్‌ను వినియోగించ గలుగుతున్నారు. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 86 శాతం మంది OTT మ్యూజిక్, వీడియో సర్వీసులను ఆస్వాదిస్తున్నారు.
ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్టు 2023 (Internet in india Report 2023) ఈ వివరాలను వెల్లడించింది. మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్, ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ రిపోర్టును రూపొందించింది. OTT, కమ్యూనికేషన్, సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ గేమింగ్ పై పెరుగుతున్న ఆదరణను హైలెట్ చేస్తుంది.

దీంతోపాటు స్మార్ట్ టీవీలు, స్మార్ట్ స్వీకర్‌లు, ఫైర్‌స్టిక్‌లు, క్రోమ్‌కాస్ట్‌లు, బ్లూరే ప్లేయర్ వంటి వినియోగం 2021 మరియు 2023 మధ్య 58 శాతం పెరిగిందని ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్టు 2023 పేర్కొంది. గత సంవత్సరంలోనూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం అత్యధికంగా ఆదరణ పొందాయి.
గత సంవత్సరం సుమారు 80 శాతం కంటే ఎక్కువ మంది OTT యూజర్లు మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లను వినియోగించారు. వీడియో OTT యూజర్ల కంటే 8 శాతం వేగంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ యూజర్లు వృద్ధి చెందుతున్నారు. దీంతోపాటు ఈ రిపోర్టు మరిన్ని కీలక విషయాలను వెల్లడించింది.

36 శాతం యూజర్ల వయస్సు 25 నుంచి 34 సంవత్సరాల మధ్యలోనే.. : దేశవ్యాప్తంగా గత సంవత్సరం మొత్తం 821 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లలో సుమారు 580 మిలియన్ యూజర్లు మ్యూజిక్ స్టీమింగ్ సర్వీసులను వినియోగించారు. ఇందులో 36 శాతం మంది యూజర్ల వయస్సు 25 నుంచి 34 సంవత్సరాల మధ్యలోనే ఉంది.
దీంతోపాటు సుమారు 370 మిలియన్ల డిజిటల్ పేమెంట్స్ యూజర్లు, ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం 24 మిలియన్, 575 మిలియన్ల సోషల్ మీడియా యూజర్లు, 438 మిలియన్ల ఆన్‌లైన్ గేమింగ్ యూజర్లు, కమ్యూనికేషన్ కోసం 621 మిలియన్ యూజర్లు, 427 మిలియన్ నెట్ కామర్స్ ఉన్నారు.
అయితే ఈ నివేదిక మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత్‌లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగం ఉందని ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్టు 2023 పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 442 మిలియన్ యూజర్లు ఉండగా పట్టణ ప్రాంతాల్లో 378 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
ఝార్ఖండ్, బిహార్ వంటి ప్రాంతాల్లో.. : ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్టు 2023 ఆధారంగా గత సంవత్సరం భారత్‌లో 820 యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఝార్ఖండ్, బిహార్ వంటి ప్రాంతాల్లో వరుసగా 46 శాతం, 37 శాతం చొప్పున యూజర్లు వృద్ధి చెందారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








