వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ షార్ట్‌కట్‌లు

Posted By: Staff

వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ షార్ట్‌కట్‌లు

బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు ఏదైనా లింక్‌ను కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేయాలంటే Ctrl మీటని నొక్కి ఉంచి లింక్‌పై మౌస్‌తో క్లిక్‌ చేయండి. బ్రౌజర్‌లోని ట్యాబ్‌ల్లోకి వరుసగా మారాలంటే Ctrl+Tab నొక్కండి. బ్రౌజ్‌ చేస్తున్న ట్యాబ్‌ను క్లోజ్‌ చేయాలంటే Ctrl+W* వరసగా తొమ్మిది ట్యాబ్‌ విండోలను ఓపెన్‌ చేసినప్పుడు నెంబర్‌ ఆధారంగా కావాల్సిన దాంట్లోకి వెళ్లాలంటే Ctrl+No ఫైర్‌ఫాక్స్‌ కొత్త వెర్షన్‌లో ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేసినప్పుడు ప్రాసెన్‌లో ఉన్న కొన్నింటిని చిన్న బటన్స్‌గా మార్చేయాలంటే ట్యాబ్‌పై రైట్‌క్లిక్‌ చేసి Pin as App Tabపై క్లిక్‌ చేయండి. హైపర్‌ లింక్‌లేని సైట్‌లను సులువుగా ఓపెన్‌ చేయాలంటే లింక్‌ను సెలెక్ట్‌ చేసి రైట్‌క్లిక్‌ చేసి Open in New tabపై క్లిక్‌ చేయండి.

సిస్టంని లాగ్‌ఆఫ్‌ చేకుండా వెళ్లాల్సివస్తే సింపుల్‌గా తాళం వేయండి. అందుకు సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. డెస్క్‌టాప్‌పై షార్ట్‌కట్‌ క్రియేట్‌ చేసుకుంటే సరి. అదెలాగంటే... తెరపై రైట్‌క్లిక్‌ చేసి New->Shotcutను క్లిక్‌ చేయండి. వచ్చిన విండోలో rundll32.exe User32.dll,LockWorkStation అని టైప్‌ చేసి Nextపై క్లిక్‌ చేయండి. తర్వాత విండోలో షార్ట్‌కట్‌కి ఏదొక పేరు పెట్టండి. ఇక దానిపై క్లిక్‌ చేస్తే సిస్టం లాగ్‌ఆఫ్‌లోకి వెళ్లపోతుంది. పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తేగానీ ఎవ్వరూ యాక్సెస్‌ చేయలేరు. షార్ట్‌కట్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ప్రాపర్టీస్‌'పై క్లిక్‌ చేసి షార్ట్‌కట్‌కి ఏదైనా ఐకాన్‌ గుర్తుని పెట్టుకోవచ్చు.

ఇన్‌స్టాల్‌ చేసిన కొన్ని సాఫ్ట్‌వేర్‌లు స్టార్ట్‌అప్‌లోకి చేరి సిస్టం స్టార్ట్‌ అవ్వగానే ట్రేలోకి చేరి కూర్చుంటాయి. వాటిలో అక్కర్లేని వాటిని తొలగించాలంటే డిసేబుల్‌ చేసేయవచ్చు. అందుకు స్టార్ట్‌లోని రన్‌పై క్లిక్‌ చేసి, mscofig టైప్‌ చేసి ఎంటర్‌ చేయండి. System Configuration Utility విండో వస్తుంది. దాంట్లోని స్టార్ట్‌అప్‌ ట్యాబ్‌ను సెలెక్ట్‌ చేస్తే మొత్తం ప్రోగ్రాంలు కనిపిస్తాయి. వాటిల్లో అక్కర్లేని వాటిని అన్‌చెక్‌ చేసి అప్త్లె చేయాలి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting