ఇంటర్నెట్ ఎంత ప్రమాదమో తెలుసా, కొత్త నిజాలు వెలుగులోకి
స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న నేపథ్యంలో చాలామంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు దానికి బానిసలవుతున్నారు. ఇంటర్నెట్ వాడకం వీరందరితో విపరీతం
స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న నేపథ్యంలో చాలామంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు దానికి బానిసలవుతున్నారు. ఇంటర్నెట్ వాడకం వీరందరితో విపరీతంగా పెరిగిపోయింది. అత్యవసర పనులకు, కాలక్షేపానికి , ముఖ్యమైన ఆఫీసు పనులకు ఇంటర్నెట్ అనేది ప్రధాన ఆయుధంగా మారింది. ఇందులో భాగంగానే చిన్నారులు, పెద్దలు అన్ని వర్గాల ప్రజలు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల చేతిలో కీలుబొమ్మలవుతున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుంటే అసలు సమయమే తెలియకుండా గడుపుతున్నారు.

సోషల్ మీడియా మరింతగా విస్తరించాక దీని మీద ఇంకా కాన్సంట్రేషన్ పెరిగింది. ఇది వరకు వేసవికాలం వచ్చిదంటే పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర గడిపేవారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. వేసవి వస్తే చాలు పిల్లలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలోని యాప్స్, గేమ్స్‌తోనే లీనమవుతున్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న టెక్నాలజీతో కంప్యూటర్, నెట్ వాడకం తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. కాకుంటే ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం మోతాదుకు మించిపోతుంది.

అనారోగ్య సమస్యలు
ఈ ఇంటర్నెట్ వాడకం విపరీతం కావడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి చివరకు చావు అంచుల వరకు వెళుతున్నారని సర్వేలు సైతం చెబుతున్నాయి.
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చువడం వల్ల మెదడు ఆలోచనా విధానం మారిపోతుందని నిపుణులు పరిశోధనలో తేలింది. యారీస్మాల్ అనే సైకియాట్రిస్ట్, బ్రెయిన్ సైంటిస్ట్ అయిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో నెట్‌తో అయితే జ్ఞాపక శక్తి మందగిస్తుందనే ఆశ్చర్యకర విషయం బయటపడింది.

ఒంటరిగా ఉండడానికి
స్మార్ట్‌ఫోన్ ఇంటెర్నెట్‌లో వెబ్‌సైట్లు, గేమ్స్ ఆడుతూ ఎక్కువ సమయం గడుపుతున్న వారి ఆలోచనా విధానం సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సామాజిక చైతన్యం, ముఖ కవళికల ప్రతిస్పందనల తీరు చాలా తక్కువగా ఉంటుందని వారంటున్నారు. దీనినే సామాజిక ఎడబాటు (సోషల్ ఆక్వర్నెస్)గా వారు అభివర్ణించారు. ఇటువంటి వ్యక్తులు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారని నిర్ధారించారు.

పిల్లలపై ప్రతికూల ప్రభావం
వేసవికాలం వచ్చిదంటే చాలు పిల్లలు ఆండ్రాయిడ్ ఫోన్లు కంప్యూటర్లకు అతుక్కుపోతారు. అన్నమైనా తినకుండా ఉంటారు. కానీ కంప్యూటర్లను మాత్రం వదలరు. కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్లలో లీనమైతే ఆసలు సమయమే తెలియకుండా గడిపేస్తారు. అయితే కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉండే పిల్లలపై తీవ్రప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధనలో బయటపడింది.

అతిధీర్ఘంగా ఆలోచించే వారి గురించి..
సాధారణంగా పిల్లల్లో విషయ సేకరణ, చదువటంలో న్యూటప్ట్స్ యూనియన్ వారు చేసిన పరిశీధనలో అతిధీర్ఘంగా ఆలోచించే వారి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే చాలా సమయం పడుతుందని, విషయాలను పిల్లలు జ్ఞాపకముంచుకోవాలంటే సమయం తీసుకుంటారని వెల్లడైంది.

సన్నగిల్లుతున్న సామాజిక చైతన్యం
కంప్యూటర్‌పై ఎక్కువ సమయం వెచ్చించేవారు ఏ పనినైనా చాలా తక్కువ వ్యవధిలో పూర్తిచేయాలని ఆలోచిస్తారని తెలిసింది. యువతీ, యువకుల్లో ఎస్‌ఎంఎస్, చాటింగ్ చేయడం ద్వారా వారిలో సామాజిక నైపుణ్యం సన్నగిల్లడమేగాక జీవితంలో నిర్ణయాత్మకంగా ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కార మార్గం
సమయానుకూలంగా సామాజిక, సాంస్కృతిక విలువలు పెంపొందించుకుంటూ శాస్త్రీయ విజ్ఞానాన్ని సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుంటే నిత్య జీవితంలో కంప్యూటర్‌ను వినియోగించే వారు సమస్యలకు లోనుకారని సైకియాట్రిస్ట్‌లు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని, లేకుంటే మున్ముందు సమస్యలు తప్పనిసరి ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

బంధాలకు దగ్గరవండి
స్మార్ట్ ఫోన్లు వచ్చాక బంధాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. అందరూ స్మార్ట్ ఫోన్లలోనే బంధాలను వెతుక్కుంటున్నారు. ఈ బంధాలతో అనేక రకాలైన సమస్యలను సృష్టించుకుంటున్నారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య చాలా ఎడబాటు వస్తోంది. భార్యాభర్తల మధ్య అనేక అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ సమసిపోవాలంటే ఇంటర్నెట్ కి కాస్త దూరంగా ఉండాలని నిపుణులు చెబుతన్నారు.


Click it and Unblock the Notifications








