గూగుల్ కొత్త అప్లికేషన్ మొబైల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌

Posted By: Super

గూగుల్ కొత్త అప్లికేషన్ మొబైల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ 'గూగుల్ వాలెట్' పేరుతో యూజర్స్ కోసం ప్రత్యేకంగా పేమెంట్స్‌ని చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. పోయిన సంవత్సరం మే నెలలో ఈ మొబైల్ పేమంట్ అప్లికేషన్ గురించి తెలియజేయడం జిరిగింది. అనుకున్న సమయంలో యూజర్స్ కోసం ఈ మొబైల్ పేమంట్ అప్లికేషన్‌ని విడుదల చేయడం జరిగిందన్నారు. ఐతే ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ కేవలం 'నెక్సస్ ఎస్ 4జీ ఫోన్'లో మాత్రమే అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.

ఈ సందర్బంలో గూగుల్ వైస్ ప్రెసిండెంట్ ఒసామా బిడైర్‌ మాట్లాడుతూ గూగుల్‌ వాలెట్‌ను పూర్తిగా పరీక్షించిన మీదటే విడుదల చేస్తున్నామని తెలియజేశారు. సెల్‌ఫోన్‌ యూజర్లు సిటీ మాస్టర్‌ కార్డ్‌, గూగుల్‌ ప్రీ పెయిడ్‌ కార్డుల నుంచి గూగుల్ వాలెట్‌ సహాయంతో చెల్లింపులు జరపవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా గూగుల్ కంపెనీ గోల్ ఏంటంటే యూజర్స్‌కు పేమంట్స్ అనేవి చాలా ఈజీగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే దీనిని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.

ఈ సంవత్సరం చివరికల్లా ఎవరైతే త్వరగా ఎవరైతే యూజర్స్ ఈ గూగుల్ వ్యాలెట్‌కి అనుసందానం అవుతారో వారి గూగుల్ ప్రీపెయిడ్ కార్డ్‌కి ప్రత్యేకంగా $10 ఫ్రీబోనస్‌గా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot