ఉచిత వైఫై వాడే సమయంలో చేయకూడని తప్పులు
చాలామంది ఎక్కడికెళ్లినా అక్కడ ఉచిత వైఫై ఉందా లేదా అని చూస్తుంటారు. ఫ్రీగా వైఫై దొరికితే వెంటనే అక్కడ మొబైల్ లో లాగిన్ అయిపోతారు. ఎంచక్కా ఫ్రీగా బ్రౌజింగ్ అయిపోతుందని సంబరపడిపోతుంటారు. అయితే ఇలా సంబరపడ్డమే హ్యాకర్లకువరగా మారుతోంది. ఎందుకంటే ఉచిత వైఫై వాడితే వారికి పాస్ వర్డ్స్ దొంగిలించడం చిటికెలో పని. మేన్ ఇన్ ది మిడిల్ ఎటాక్, సైజ్ జాకింగ్ లాంటి పద్ధతుల ఆధారంగా హ్యాకింగ్ కు పాల్పడుతుంటారు. ఉచిత వైఫైలో ఈ రెండు పద్ధతల్ని ఉపయోగించడం వెరీ ఈజీ. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఉచిత వైఫై వాడుతున్న నెటిజన్లలో దాదాపు 77శాతం మంది తమ సమాచారాన్ని హ్యాకర్లకు సమర్పించుకున్నారు. వీరిలో 52శాతం మంది ఇప్పటికే క్రెడిట్ కార్డు మోసాలకు గురయ్యారు. మరెంతో మంది బ్యాంక్ ఎకౌంట్లలో డబ్బు పోగొట్టుకున్నారు.ఇకపై ఉచిత వైఫ్ వాడుతున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో ఈ కింద సూచిస్తున్నాం.

ఈ జాగ్రత్తలు అవసరం
ఉచిత వైఫై రన్ అవుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ వాడొద్దు. ఉచిత వైఫై లో పాస్ వర్డులు టైపు చేయొద్దు. ఉచిత వైఫై వాడుతున్న టైమ్ లో కీలకమైన సమాచారాన్ని మెసేజ్ చేయొద్దు. ఉచిత వైఫైలో ఎలాంటి డౌన్ లోడ్స్ పెట్టొద్దు. కేవలం యూట్యూబ్ లో వీడియోలు చూడ్డానికి, వాట్సాప్ మెసేజీలు చెక్ చేసుకోవడానికే వాడాలి. ఉచిత వైపై వాడుతున్నప్పుడు ఫైల్ షేరింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేయాలి. వైఫై వాడకం పూర్తయిన తర్వాత Forget Network ఆప్షన్ ను కచ్చితంగా సెలక్ట్ చేయాలి. లేదంటే మనం నెట్ నుంచి బయటకు వచ్చేసినా ఆటోమేటిగ్గా ఫ్రీ వైఫై కనెక్ట్ అయి, హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంది.పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని ఇతరుల చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్ సర్వే హెచ్చరిస్తోంది. అప్ డేటెడ్ OS వాడుతుండడం ఉత్తమం.దీంతో డివైజ్ ఎక్కువ సురక్షితంగా ఉంటుంది..యాంటీవైరస్ టూల్స్ వాడండి.నగదు లావాదేవీలు,పాస్ వర్డ్ ఎంటర్ చేసే పనులు చేయకండి. లేటెస్ట్. మొబైల్స్ లో టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఉంటుంది.దాన్ని ఆన్ చేసుకోండి. పని పూర్తైతే వెంటనే వైఫై ఆఫ్ చేయండి. VPNద్వారా ఉచిత వైఫై వాడుకోవడం ఉత్తమం.
KRACK
ఆ మధ్య KRACK పేరుతో పిలుస్తున్న వల్నరబులిటీ WAP2 వైఫై ప్రొటోకాల్‌పై పూర్తిస్థాయిలో ప్రభావం చూపింది. యూజర్ వైఫైకి కనెక్ట్ అయిన ప్రతీసారి హ్యాకర్లు రహస్యంగా డేటాను చూసే అవకాశం ఉందని తెలిసింది. క్రాక్ అంటే కీ రీ ఇన్‌స్టాలేషన్ అటాక్. ఈ వల్నరబులిటీ ఫోర్ వే అథింటికేషన్‌లోని మూడవ స్టెప్‌ను టార్గెట్ చేస్తుంది. అంటే మీ వైఫై క్లయింట్ డివైస్, ప్రొటెక్టెడ్ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతున్న సమయంలో హ్యాకర్లు దాడికి తెగబడుతున్నారు. ఫోర్‌వే అథింటికేషన్‌లో మూడో స్టెప్‌లో ఎన్‌క్రిప్షన్ కీ అనేకసార్లు రీసెంట్ కాబడుతుంది. ఈ సయమంలో హ్యాకర్లు ఎన్‌క్రిప్షన్ కీని కలెక్ట్ చేసుకొని వైఫై సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా బ్రేక్ చేసినప్పుడు ఆ నెట్‌వర్క్ ద్వారా మీరు నిర్వహించుకునే ప్రతి ఆన్‌లైన్ లావాదేవీ హ్యాకర్లకు తెలిసిపోతుంది.
ఆండ్రాయిడ్ 6.0 ఆపై వర్షన్లతో రన్ అయ్యే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు
ఈ సమస్య ఎక్కువగా ఆండ్రాయిడ్ 6.0 ఆపై వర్షన్లతో రన్ అయ్యే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ ప్రమాదం కలిగించింది. ఇప్పుడు కూడా ఈ దాడి జరుగుతోంది. ఈ దాడి నుంచి మీరు బయటపడాలంటే మీ డివైస్‌లో సెక్యూరిటీ స్టాండర్ట్స్ అలానే సాఫ్ట్‌వేర్స్ అప్ టు డేట్‌గా అప్‌గ్రేడ్ చేయాలి. ఈ సమయంలో వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండాలి. వైరిడ్ ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ డేటాపై ఆధారపడడం మంచిది. ఈ హ్యాకింగ్ నుంచి ఎదుర్కొనేందుకు విండోస్, iOS, watchOS, macOSల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను తీసుకొచ్చినట్లు ఆపిల్, విండోస్ సంస్థలు తెలిపాయి.


Click it and Unblock the Notifications