భారత్‌లో ఇంటర్నెట్ యూజర్లు 15కోట్లు!

Posted By: Staff

భారత్‌లో ఇంటర్నెట్ యూజర్లు 15కోట్లు!

 

న్యూఢిల్లీ: యువత నుంచి పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఇండియాలో ఇంటర్‌నెట్ వేగంగా విస్తరిస్తోందని ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది చివరికి ఇంటర్‌నెట్ యూజర్ల సంఖ్య 15 కోట్లకు చేరగలదని ఆ సర్వే సదురు నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇంటర్‌నెట్ వాడకందారులు 16% చొప్పున పెరిగినట్లు దేశీయ ఇంటర్‌నెట్, మొబైల్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ) విశ్లేషించింది. వెరసి 2012 డిసెంబర్‌కల్లా దేశీయ ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్య 15 కోట్లకు చేరుకుంటుందని లెక్కకట్టింది. ఈ సంఖ్యలో పట్టణ వినియోగదారుల వాటా 10.5 కోట్లుకాగా, పల్లె ప్రాంతాల నుంచి 4.5 కోట్ల మంది యూజర్లు జతకాగలరని అభిప్రాయపడింది. 2012 జూన్‌కల్లా మొత్తం వీరి సంఖ్య 13.7 కోట్లకు చేరినట్లు తెలిపింది.

ఆ కంటెంట్ చూడటంలో ఇండియన్లు సెకండ్!

ముంబై: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ద్వారా విద్యాపరమైన అంశాలను అన్వేషించటంలో భారత్ రెండవ స్థానంలో నిలిచిందని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. 2008లో 8వ స్థానంలో ఉన్న ఇండియా ప్రస్తుతం అమెరికా తరువాతి స్థానాన్ని ఆక్రమించటం విద్యాభివృద్ధికి చిహ్నంగా భావించవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారిలో 60 శాతం మంది భారతీయ విద్యార్థులు వివిధ విద్యా కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి గూగుల్ బ్రౌజర్ పైనే ఆధారపడుతున్నారని గూగుల్ ఇండియా నిర్వహించిన ‘స్టూడెంట్స్ ఆన్ వెబ్ ’అధ్యయనంలో వెల్లడైంది. న్యూఢిల్లీ, ముంబయ్, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రముఖ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. 6 కోట్ల మంది పైగా ఇంటర్నెట్ యూజర్లు 18-35 ఏళ్ల మధ్యలో ఉన్నవారు కావడంతో విద్యా సంబంధమైన విషయాల గురించి అన్వేషణ విస్తృతంగా ఉంటోందని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot